Vijay Deverakonda
Vijay Deverakonda : విజయ్ దేవరకొండ ఇటీవల కింగ్డమ్ సినిమాతో వచ్చిన సంగతి తెలిసిందే. జెర్సీ లాంటి సూపర్ హిట్ తీసిన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సినిమా కావడంతో రిలీజ్ కి ముందు ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సత్యదేవ్ ఈ సినిమాలో కీలక పాత్ర చేసాడు. కింగ్డమ్ సినిమా భారీ ఓపెనింగ్స్ వచ్చినా లాంగ్ రన్ లో నిలబడలేదు. కలెక్షన్స్ పరంగా చూసుకుంటే కింగ్డమ్ సినిమాకు నష్టమే వచ్చింది అని టాలీవుడ్ టాక్.(Vijay Deverakonda)
మాస్, యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్, సాంకేతికత విషయంలో అయితే కింగ్డమ్ చాలా బాగుంది. కానీ కథ పాతది అవడం, కథనం కూడా సింపుల్ గా ఉండటంతో కింగ్డమ్ సినిమా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అయితే కింగ్డమ్ సినిమాకు సీక్వెల్, ప్రీక్వెల్ కూడా ప్రకటించారు. ప్రీక్వెల్ లో విజయదేవరకొండ రాజు గా ఉన్న కథ ఉంటుంది. సీక్వెల్ లో విజయ్ శ్రీలంక లో ఒక జాతికి నాయకుడు అయ్యాక కథ ఉంటుంది.
Also Read : Shanmukh Jaswanth : దీప్తి తో బ్రేకప్.. ఇన్నేళ్ల తర్వాత కొత్త లవర్ ని పరిచయం చేసిన షణ్ముఖ్..
అప్పుడే కింగ్డమ్ 2 ఉంటుందా అని సందేహాలు ఉన్నా దర్శకుడు, నిర్మాత మాత్రం ఉంటుందనే చెప్పారు. అయితే తాజాగా నిర్మాత నాగవంశీ ఓ ఇంటర్వ్యూలో కింగ్డమ్ సినిమా గురించి మాట్లాడుతూ.. కింగ్డమ్ 2 సినిమా ఉండదు. ఇప్పుడప్పుడే ఉండకపోవచ్చు. జరిగిపోయిన దాన్ని తవ్వి గౌతమ్ ని బాధపెట్టడం తప్ప ఇంకేమి లేదు. గౌతమ్ తో మాత్రం వేరే సినిమా ఉంటుంది మా నిర్మాణ సంస్థలో అని తెలిపాడు.
దీంతో నాగవంశీ కామెంట్స్ చూస్తే అసలు కింగ్డమ్ 2 ఉండే ఛాన్స్ లేదనే అర్థమయిపోతుంది అని అంటున్నారు. గౌతమ్ తో వేరే సినిమా ఉంటుంది కానీ కింగ్డమ్ 2 మాత్రం ఉండదు అనడంతో విజయ్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.
Also Read : Ketika Sharma : న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. విదేశాల్లో రచ్చ చేస్తున్న కేతిక శర్మ..