Shanmukh Jaswanth : దీప్తి తో బ్రేకప్.. ఇన్నేళ్ల తర్వాత కొత్త లవర్ ని పరిచయం చేసిన షణ్ముఖ్..
న్యూ ఇయర్ సందర్భంగా షణ్ముఖ్ జస్వంత్ తన కొత్త ప్రేమికురాలిని పరిచయం చేసాడు. (Shanmukh Jaswanth)
Shanmukh Jaswanth
- గతంలో దీప్తి సునైనాతో షణ్ముఖ్ బ్రేకప్
- వార్తల్లో, వివాదాల్లో నిలిచిన షణ్ముఖ్
- నేడు కొత్త ప్రేయసిని పరిచయం చేసిన షణ్ముఖ్
Shanmukh Jaswanth : సోషల్ మీడియాలో కవర్ సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లతో ఫేమ్ తెచ్చుకున్నాడు షణ్ముఖ్ జస్వంత్. కరోనా తరవాత బిగ్ బాస్ సీజన్ 5 లో పాల్గొని మరింత వైరల్ అయ్యాడు. అప్పుడే వార్తల్లో కూడా నిలిచాడు. బిగ్ బాస్ ముందు దీప్తి సునైనాతో ప్రేమలో ఉండేవాడు షణ్ముఖ్. వీళ్ళిద్దరూ బహిరంగంగానే తమ ప్రేమని చూపించారు.(Shanmukh Jaswanth)
అయితే బిగ్ బాస్ లో షణ్ముఖ్ సిరి హన్మంత్ కి క్లోజ్ గా ఉండటంతో దీప్తితో బ్రేకప్ అయిపొయింది. వీరి బ్రేకప్ ని కూడా అధికారికంగానే ప్రకటించారు. ఆ తర్వాత మళ్ళీ షణ్ముఖ్ సిరీస్ లు, సినిమాలు ట్రై చేస్తున్నాడు. మధ్యలో ఓ యాక్సిడెంట్, గంజాయి తాగాడు అని వివాదాల్లో నిలిచాడు.
Also Read : Sahakutumbaanaam : ‘సఃకుటుంబానాం’ మూవీ రివ్యూ.. కొత్తరకం ఫ్యామిలీ స్టోరీ..
కానీ తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా షణ్ముఖ్ జస్వంత్ తన కొత్త ప్రేమికురాలిని పరిచయం చేసాడు. ముఖం కనపడకుండా ఓ అమ్మాయితో దిగిన పలు ఫోటోలను షేర్ చేసి షణ్ముఖ్.. హ్యాపీ బర్త్ డే V. ఇది దేవుడి ప్లాన్ అని పోస్ట్ చేసాడు. దీంతో ఆ అమ్మాయి పేరు V తో స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది కానీ ఆ అమ్మాయి ఎవరో చెప్పలేదు.

మరి ఆ అమ్మాయి ఎవరు? వీరి పరిచయం, ప్రేమ సంగతి ఏంటి అని షన్ను ఫ్యాన్స్ తెగ వెతికేస్తున్నారు. ఇక దీప్తి తో మూవ్ ఆన్ అయినట్టే షణ్ముఖ్ కొత్త జీవితంలోకి వెళ్తున్నాడు అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. మరి షణ్ముఖ్ జస్వంత్ కొత్త ప్రేయసి వరో ఎపుడు చెప్తాడో చూడాలి.
Also See : Rakul Preet Singh : భర్తతో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్.. ఫొటోలు వైరల్..
