Sahakutumbaanaam : ‘సఃకుటుంబానాం’ మూవీ రివ్యూ.. కొత్తరకం ఫ్యామిలీ స్టోరీ..

సఃకుటుంబానాం సినిమా జనవరి 1న థియేటర్స్ లో రిలీజయింది. (Sahakutumbaanaam)

Sahakutumbaanaam : ‘సఃకుటుంబానాం’ మూవీ రివ్యూ.. కొత్తరకం ఫ్యామిలీ స్టోరీ..

Sahakutumbaanaam

Updated On : January 2, 2026 / 9:00 AM IST

Sahakutumbaanaam : రామ్ కిరణ్, మేఘ ఆకాష్ జంటగా తెరకెక్కిన సినిమా ‘సఃకుటుంబానాం’. హెచ్ ఎన్ జి సినిమాస్ బ్యానర్ పై మహదేవ్ గౌడ్, నాగరత్న నిర్మాణంలో ఉదయ్ శర్మ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. సఃకుటుంబానాం సినిమా జనవరి 1న థియేటర్స్ లో రిలీజయింది. రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, శుభలేఖ సుధాకర్, సత్య, రాజశ్రీ నాయర్, రచ్చ రవి, గిరిధర్, తాగుబోతు రమేష్, భద్రం.. పలువురు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు.(Sahakutumbaanaam)

కథ విషయానికొస్తే..

కళ్యాణ్(రామ్ కిరణ్) సాఫ్ట్ వేర్ జాబ్ చేసుకునే ఓ మధ్య తరగతి కుటుంబం వ్యక్తి. అతనికి ఫ్యామిలీ అంటే ప్రేమ. ఆఫీస్, ఇల్లు తప్ప కళ్యాణ్ కి ఇంకేమి తెలీదు. ఇంట్లో వాళ్ళు కూడా ఎంతో అన్యోన్యంగా ఉంటూ కళ్యాణ్ మీద ప్రేమ చూపిస్తారు. కళ్యాణ్ ఆఫీస్ లో కొత్తగా సిరి(మేఘ ఆకాష్) చేరుతుంది. సిరి – కళ్యాణ్ పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. సిరిని తన కుటుంబానికి పరిచయం చేస్తాడు కళ్యాణ్.

అయితే కళ్యాణ్ ఉన్నంతసేపు ప్రేమగా ఉన్న ఫ్యామిలీ వెళ్ళిపోయాక గొడవలు పడుతుంది. ఇదేంటని సిరి ప్రశ్నించడంతో అసలు మేము వాడి ఫ్యామిలీనే కాదు, అతనికి ఓ జబ్బు ఉంది అంటూ చెప్తారు. మరి కళ్యాణ్ తో ఫ్యామిలీ అంటూ ఉన్న వాళ్ళు ఎవరు? కళ్యాణ్ కి ఉన్న జబ్బు ఏంటి? కళ్యాణ్ – సిరి ప్రేమ ఏమైంది? సిరి వచ్చాక కళ్యాణ్ జీవితం ఎలా మారింది? అసలు కళ్యాణ్ ఎవరు.. తెలియాలంటే తెరపై చూడాల్సిందే..

Also Read : Gatha Vaibhavam Review : ‘గత వైభవం’ మూవీ రివ్యూ.. జన్మజన్మల ప్రేమకథ..

సినిమా విశ్లేషణ..

ఫ్యామిలీ అంటే ఇష్టం, హీరో ఫ్యామిలీ మ్యాన్ అనే కథలతో కొన్ని వేల సినిమాలు వచ్చాయి. టైటిల్ చూసి ఇది కూడా అదే కోవలోకి చెందింది అనుకుంటాము. కానీ ఇది ఒక కొత్త పాయింట్ తో తెరకెక్కించారు. ఫస్ట్ హాఫ్ అంతా ఫ్యామిలీ సీన్స్, సిరి – కళ్యాణ్ ప్రేమ సీన్స్ తో సాగి ఇంటర్వెల్ కి అసలు కళ్యాణ్ ఎవరు, ఫ్యామిలీ ఎవరు అని ట్విస్ట్ ఇచ్చి సెకండ్ హాఫ్ పై ఆసక్తి నెలకొల్పారు.

సెకండ్ హాఫ్ లో హీరో ఫ్లాష్ బ్యాక్, ఫ్యామిలీ గురించి చెప్పే సీన్స్ కొత్తగా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఇక క్లైమాక్స్ మాత్రం రొటీన్ యాక్షన్, ఎమోషన్స్ తో ముగించేశారు. మధ్యమధ్యలో సత్య, బ్రహ్మానందం కామెడీ వర్కౌట్ అయినా రచ్చరవి అక్కర్లేని కామెడీ సీన్స్ ఎడిటింగ్ లో తీసేస్తే బెటర్ అనిపిస్తుంది. ఫ్యామిలీ ఎమోషన్స్, సీన్స్ అన్ని కూడా చాలా సినిమాల్లో చూసినట్టే ఉంటాయి. ఫ్యామిలీ ఎమోషన్ కి ఓ సరికొత్త పాయింట్ ని జతచేసి చూపించడానికి ట్రై చేసాడు దర్శకుడు.

Sahakutumbaanaam

నటీనటుల పర్ఫార్మెన్స్..

కన్నడ నటుడు రామ్ కిరణ్ మొదటి సినిమా అయినా బాగానే మెప్పించాడు. రెండు వేరియేషన్స్ లో తన నటనతో పర్వాలేదనిపించారు. హీరోయిన్ మేఘ ఆకాష్ క్యూట్ గా కనిపిస్తూనే పలు సీన్స్ లో తన నటనతో మెప్పిస్తుంది. తండ్రి పాత్రలో రాజేంద్ర ప్రసాద్ చక్కగా నటించారు. బ్రహ్మానందం, సత్య అక్కడక్కడా నవ్వించారు. భద్రం, నిత్య, రచ్చ రవి, శుభలేఖ సుధాకర్.. పలువురు వారి పాత్రల్లో మెప్పించారు.

Also Read : Psych Siddhartha Review : ‘సైక్ సిద్దార్థ’ రివ్యూ.. దరిద్రం అంతా వీడి లైఫ్ లోనే ఉందిగా..

సాంకేతిక విశ్లేషణ.. సినిమాటోగ్రఫీ విజువల్స్ మాత్రం కలర్ ఫుల్ గా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ పర్వాలేదు అనిపిస్తాయి. ఎడిటింగ్ పరంగా మాత్రం కొన్ని అక్కర్లేని కామెడీ సీన్స్ కట్ చేస్తే బెటర్. రెగ్యులర్ ఫ్యామిలీ కథలకు భిన్నంగా ఓ కొత్త కోణంలో కొత్త పాయింట్ తో డైరెక్టర్ ఈ సినిమాని తెరకెక్కించాడు. నిర్మాణ పరంగా కూడా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు తెలుస్తుంది.

మొత్తంగా ‘సఃకుటుంబానాం’ సినిమా ఓ కొత్తరకం ఫ్యామిలీ స్టోరీ. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.