Producer Ravishankar Comments on Allu Arjun Sukumar Pushpa 3
Pushpa 3 : సుకుమార్ – అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన పుష్ప, పుష్ప 2 సినిమాలు మంచి విజయాలు సాధించాయి. పుష్ప 2 అయితే భారీ పాన్ ఇండియా హిట్ కొట్టి 1850 కోట్ల గ్రాస్ వసూలు చేసి బాహుబలి రికార్డు కూడా బద్దలు కొట్టింది. పుష్ప 3 కూడా అధికారికంగానే ప్రకటించారు. పుష్ప 2లో దానికి తగ్గ లీడ్ కూడా ఇచ్చారు. అయితే అల్లు అర్జున్, సుకుమార్ మాత్రం పుష్ప 3 ఇప్పట్లో ఉండదు, దానికి టైం తీసుకుంటాం అని గతంలో చెప్పారు.
తాజాగా పుష్ప నిర్మాత రవిశంకర్ రాబిన్ హుడ్ సినిమా ప్రమోషన్స్ లో మాట్లాడుతూ.. త్వరలో పుష్ప 3 సినిమా తీస్తాం. మూడు సంవత్సరాల వ్యవధిలోనే ఈ సినిమాని పూర్తి చేస్తాము అని తెలిపారు. దీంతో నిర్మాత వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. బన్నీ ఫ్యాన్స్ దీనిపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కానీ నిర్మాత చెప్పినట్టు మూడేళ్ళలో సినిమా పూర్తి చేయాలంటే ఇప్పుడే స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టి, షూట్ చేయాలి. అల్లు అర్జున్ ప్రస్తుతం వరుసగా మూడు సినిమాలను లైన్లో పెట్టాడు. అట్లీతో, త్రివిక్రమ్ తో, సందీప్ రెడ్డి వంగతో సినిమాలు చేయాలి బన్నీ. ఈ మూడు సినిమాలు చేసేసరికి ఐదేళ్లు పట్టొచ్చు. ఇక సుకుమార్ రామ్ చరణ్ తో, విజయ్ దేవరకొండతో సినిమాలు అనౌన్స్ చేసాడు. ఆ రెండు సినిమాలు అవ్వలన్నా అంతే టైం పట్టుద్ది. సుకుమార్, బన్నీ ఇలా వేరే సినిమాలతో బిజీ అవుతుంటే ఇప్పుడు నిర్మాత పుష్ప 3 త్వరలోనే మొదలుపెడతాం అని చెప్పడంతో అసలు బన్నీ – సుకుమార్ నెక్స్ట్ ఏ సినిమా చేస్తారో అని చర్చగా మారింది.