Anchor Shilpa Chakravarthy : 7 ఏళ్ళ బాధ.. ఆ షోకి అనవసరంగా వెళ్ళా.. నాన్న చనిపోయారు.. డిప్రెషన్.. ఏడ్చేసిన యాంకర్ శిల్ప
ఈ వీడియోలో శిల్ప మాట్లాడుతూ ఏడుస్తూ ఎమోషనల్ అయింది.

Anchor Shilpa Chakravarthy Crying while tells about her Life Problems and Trolls Video goes Viral
Anchor Shilpa Chakravarthy : యాంకర్ గా టీవీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన శిల్ప ఆ తర్వాత నటిగా మారి సీరియల్స్, పలు సినిమాలలో కూడా మెప్పించింది. ఒకానొక సమయంలో యాంకర్ సుమకు పోటీగా కూడా వచ్చింది. అయితే పిల్లలు పుట్టిన తర్వాత కొన్నాళ్ళు గ్యాప్ తీసుకుంది. మళ్ళీ బిగ్ బాస్ సీజన్ 3 తో రీ ఎంట్రీ ఇచ్చి అప్పట్నుంచి అడపాదడపా బయట ఈవెంట్స్ యాంకరింగ్ చేస్తుంది. కానీ టీవీ షోలు, సీరియల్స్ మాత్రం బాగా తగ్గించేసింది.
తాజాగా శిల్ప చక్రవర్తి ఇన్నాళ్లు ఎందుకు కనపడట్లేదు, బిగ్ బాస్ సమయంలో, కరోనా సమయంలో తను ఎంత బాధపడింది, తన డిప్రెషన్ గురించి అన్ని అంశాలు మాట్లాడుతూ ఓ వీడియో తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో శిల్ప మాట్లాడుతూ ఏడుస్తూ ఎమోషనల్ అయింది.
శిల్ప చక్రవర్తి మాట్లాడుతూ.. పిల్లలు పుట్టాక పిల్లలకు సమయం ఇద్దామనే సీరియల్స్ కి, యాంకరింగ్ కి నేను బ్రేక్ తీసుకున్నాను. రీ ఎంట్రీ యుద్ధం అనుకున్నప్పుడు ఆఫర్ రావడంతో బిగ్ బాస్ షోలోకి వెళ్ళాను. ఆ తర్వాత నా లైఫ్ చాలా మారింది. బిగ్ బాస్ తర్వాత నన్ను చాలా ట్రోల్ చేసారు. నా మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. బయటకి వచ్చాక పలు ఇంటర్వ్యూలు ఇచ్చి కౌంటర్ ఇచ్చాను. వాటికి కూడా బూతులతో తిట్టేవాళ్ళు. అవి అర్ధం కాక మా ఆయన్ని అడిగితే ఆ బూతులు చెప్పకూడదు అన్నారు. ఆ షోకి వెళ్లకుండా ఉండాల్సింది అని మా ఆయన అన్నారు. నా వీడియోల కింద బూతులు తిడుతూ కామెంట్స్ చేసారు.
యాంకర్ గా వేలమంది ముందు మాట్లాడిన నేను ఆ ట్రోల్స్ తర్వాత మాట్లాడలేకపోయాను. నేను ఏం చేశాను అని ఇలా తిడుతున్నారు అనుకున్నా. ఆ ట్రోల్స్ వల్ల డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. నాలుగు నెలలు పట్టింది డిప్రెషన్ నుంచి బయటకు రావడానికి. నన్ను మార్చడానికి మా ఆయన చాలా ట్రై చేసారు. నా హ్యాపినెస్ పోయింది. నాకు తెలిసిన వాళ్ళే నన్ను నెగిటివ్ గా చూసారు. బయటకు వెళ్లాలంటేనే భయం వేసింది. అదే సమయానికి కరోనా వచ్చింది. మా ఆయన బిజినెస్ ఆగిపోయింది. ఇంకా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను అని చెప్తూ ఏడ్చేసింది.
Also Read : Nani : ‘నాని ఫిలిం ఇండస్ట్రీ’.. చెప్పి మరీ సాలిడ్ గోడ కడుతున్న నాని.. ఇది కదా సినిమా పిచ్చి అంటే..
అలాగే తన తల్లి,తండ్రి గురించి చెప్తూ.. కరోనా సమయంలోనే మా నాన్న బెడ్ మీద నుంచి పడిపోయారు. బ్లడ్ క్లాట్ అయింది, కరోనా వల్ల ఆపరేషన్ చేయము అన్నారు. ఇంటికి తీసుకొచ్చాం. కానీ హెల్త్ మరింత పాడవ్వడంతో మళ్ళీ హాస్పిటల్ కి తీసుకెళ్ళాం. కోమాలోకి వెళ్లారు. ఆ తర్వాత హాస్పిటల్ బెడ్ మీదే నాన్న చనిపోయారు. అది నాకు పెద్ద దెబ్బ తగిలింది. దాంతో మరింత వీక్ అయిపోయాను. ఆ తర్వాత అన్నిటి మీద ఇంట్రెస్ట్ పోయింది. కరోనా తర్వాత ఆఫర్స్ వచ్చినా ఇంట్రెస్టు రాలేదు. సరే చేద్దాం అనుకునేలోపు మా అమ్మకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. కాకపోతే ట్రీట్మెంట్ తర్వాత ఇప్పుడు బాగున్నారు అని తెలిపింది.
ఆ తర్వాత కూడా కొంతమంది నీకు అవకాశాలు రావట్లేదా, నిన్ను పిలవట్లేదా, ఇంట్లోనే ఉంటున్నావా, పెద్దదానివి అయిపోయావా, హౌస్ వైఫ్ గా మారిపోయావా అని ఇష్టమొచ్చిన కామెంట్స్ చేసేవాళ్ళు. మా రిలేటివ్స్, తెలిసిన వాళ్ళే అలా మాట్లాడేవాళ్ళు అంటూ ఎమోషనల్ అయింది. ఇలా రకరకాల కారణాలతో ఇన్ని రోజులు గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ సీరియల్స్, టీవీ షోలకు వస్తాను, బిజీ అవుతాను అని తెలిపింది. యాంకర్ శిల్ప ఇలా ఏడుస్తూ వీడియో పెట్టి 7 ఏళ్లుగా తను పడిన బాధలు అన్ని చెప్పుకొని ఎమోషనల్ అయింది. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.