Nani – Priyadarshi : హిట్, కోర్ట్ రెండు యూనివర్స్ లను కలిపి.. ప్రియదర్శి మైండ్ బ్లాంక్ ఐడియా.. నాని రియాక్షన్..
కోర్ట్ సినిమాకు సీక్వెల్ కూడా ఉండే అవకాశం ఉందని గతంలోనే ప్రకటించారు.

Nani will Plan Court and Hit Cinematic Universe Merging
Nani – Priyadarshi : నాని నిర్మాతగా ప్రియదర్శి మెయిన్ లీడ్ గా ఇటీవల కోర్ట్ సినిమా రిలీజయి మంచి విజయం సాధించింది. కోర్ట్ సినిమాకు సీక్వెల్ కూడా ఉండే అవకాశం ఉందని గతంలోనే ప్రకటించారు. తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు.
ఈ సక్సెస్ మీట్ లో నాని మాట్లాడుతూ.. కోర్ట్ సినిమాకు ఇప్పుడున్న ఊపులో సీక్వెల్ అనౌన్స్ చేస్తే పాన్ ఇండియా సినిమా అయిపోతుంది అన్నారు. స్టేజిపై ఉన్న ప్రియదర్శి.. అర్జున్ సర్కార్ మీట్స్ సూర్యతేజ ప్లాన్ చేయండి అని అన్నారు. దీనికి నాని.. మన రెండు యూనివర్స్ లను కలుపుదామా. ఆ అవసరం కూడా ఉంటుందేమో. ఈ ఐడియా నా మైండ్ లో పెట్టుకుంటాను అని అన్నారు.
Also Read : Harsha Sai: యూట్యూబర్ హర్షసాయికి బిగ్ షాక్.. మరో కేసు నమోదు.. సజ్జనార్ ఫైర్
అర్జున్ సర్కార్ అనేది హిట్ 3 సినిమాలో నాని పాత్ర పేరు. సూర్య తేజ అనేది కోర్ట్ సినిమాలో ప్రియదర్శి పాత్ర పేరు. అర్జున్ సర్కార్ పోలీస్ అయితే సూర్య తేజ లాయర్. ఇప్పటికే శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ యూనివర్స్ మొదలయి హిట్, హిట్ 2 సినిమాలు వచ్చాయి. నాని హీరోగా హిట్ 3 సినిమా త్వరలో రాబోతుంది.
మరి కోర్ట్ 2 సినిమాలో నాని ఉంటాడా? లేదా హిట్ 4 సినిమాలో ప్రియదర్శి ఉంటాడా? ఈ రెండు యూనివర్స్ లను ఎలా కలుపుతారో చూడాలి. ఈ రెండు యూనివర్స్ లను కలిపితే అదిరిపోతుంది, ప్లాన్ చేయండి అని అని నాని ఫ్యాన్స్ అడుగుతున్నారు.
Also Read : AR Rahman : కంగారు పడకండి.. డిశ్చార్జ్ అయిన ఏ ఆర్ రహమాన్.. ఆ ప్రాబ్లమ్ వల్లే హాస్పిటల్ కి..
#Court ki Sequel vundocchu. Eesaari Pan India aipodhemoo
– #Nani at #CourtStateVsANobody success meet
— 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) March 15, 2025