AR Rahman : కంగారు పడకండి.. డిశ్చార్జ్ అయిన ఏ ఆర్ రహమాన్.. ఆ ప్రాబ్లమ్ వల్లే హాస్పిటల్ కి..

ఏ ఆర్ రహమాన్ నేడు ఉదయం చెన్నైలోని అపోలో హాస్పిటల్ లో చేరారు.

AR Rahman : కంగారు పడకండి.. డిశ్చార్జ్ అయిన ఏ ఆర్ రహమాన్.. ఆ ప్రాబ్లమ్ వల్లే హాస్పిటల్ కి..

AR Rahaman Health Update Discharged from Chennai Hospital

Updated On : March 16, 2025 / 12:33 PM IST

AR Rahman : తమిళ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ విన్నర్ ఏ ఆర్ రహమాన్ నేడు ఉదయం చెన్నైలోని అపోలో హాస్పిటల్ లో చేరారు. ఆయనకు ఛాతిలో నొప్పి రావడంతో హాస్పిటల్ లో అడ్మిట్ చేసారని, ఆయనకు యాంజియోప్లాస్టీ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. దీంతో ఏ ఆర్ రహమాన్ కి ఏమైంది, త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు ఆందోళన చెందారు.

Also Read : Nani : ‘నాని ఫిలిం ఇండస్ట్రీ’.. చెప్పి మరీ సాలిడ్ గోడ కడుతున్న నాని.. ఇది కదా సినిమా పిచ్చి అంటే..

తాజాగా చెన్నై అపోలో హాస్పిటల్ ఏ ఆర్ రహమాన్ ఆరోగ్యం పై అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఏ ఆర్ రహమాన్ ఇవాళ ఉదయం అపోలో హాస్పిటల్ కు వచ్చారు. ఆయన డీ హైడ్రేట్ లక్షణాలతో ఆయన జాయిన్ అయ్యారు. రొటీన్ చెకప్ తర్వాత ఆయన డిశ్చార్జ్ అయ్యారు అని ప్రకటించారు.

AR Rahman

దీంతో ఆయనపై ఆరోగ్యంపై వచ్చిన వార్తలు అవాస్తవం అని తెలుస్తుంది. కేవలం ఏ ఆర్ రహమాన్ డీ హైడ్రేట్ లక్షణాలతో మాత్రమే హాస్పిటల్ లో చేరి చెకప్ తర్వాత డిశ్చార్జ్ అయ్యారు.