Producer SKN : తెలుగు హీరోయిన్స్ వివాదం.. ట్రోలర్స్ కి కౌంటర్, క్లారిటీ ఇచ్చిన నిర్మాత..

తాజాగా మరోసారి ఈ వివాదంపై మాట్లాడుతూ నిర్మాత SKN ఓ వీడియో రిలీజ్ చేసారు.

Producer SKN : తెలుగు హీరోయిన్స్ వివాదం.. ట్రోలర్స్ కి కౌంటర్, క్లారిటీ ఇచ్చిన నిర్మాత..

Producer SKN Gives Clarity on his Comments dispute

Updated On : February 18, 2025 / 3:31 PM IST

Producer SKN : ఇటీవల సినిమా ఈవెంట్స్ లో స్టేజిపై సరదాగా మాట్లాడిన మాటలకు కొంతమంది సోషల్ మీడియాలో నెగిటివ్ గా అర్థాలు తీసి వివాదం సృష్టిస్తున్నారు. ప్రదీప్ రంగనాథన్ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత SKN సరదాగా మాట్లాడుతూ.. మా తెలుగు వాళ్ళు వేరే హీరోయిన్స్ ని బాగా ఎంకరేజ్ చేస్తాం. తెలుగు హీరోయిన్స్ ని మేము ఎంకరేజ్ చేయం. చేస్తే ఏమవుతుందో చూస్తున్నాం. అందుకే తెలుగు హీరోయిన్స్ ని ఎంకరేజ్ చేయకూడదు అనుకున్నాం అని నవ్వుతూ అన్నాడు.

Also Read : Dhanaraj : చిరంజీవి నన్ను పిలిచి అలా అనేసరికి షాక్.. మీరు వెళ్లిపోండి సర్ అన్నాను.. ఇప్పటికి 8 ఏళ్లుగా అదే.. ఆ ఛాన్స్ మాత్రం రాలేదు..

అయితే ఈ కామెంట్స్ ని కొన్ని యూట్యూబ్ ఛానల్స్, వెబ్ సైట్స్ హెడ్ లైన్స్ చేసి వివాదంగా మార్చారు. సోషల్ మీడియాలో ఖాళీగా ఉన్న కొంతమంది అయితే కాస్త లైన్ దాటి SKN అంతకుముందు సినిమాలో తెలుగమ్మాయి వైష్ణవి చైతన్యతో ఏదైనా ఇబ్బందా అంటూ పలు నెగిటివ్ కామెంట్స్ చేసారు. SKN అంటే గిట్టని వాళ్ళు విమర్శలు చేసారు. ఆల్రెడీ నిన్న రాత్రే.. ఈ మధ్య చాలా మంది వినోదం కన్నా వివాదానికే మొగ్గు చూపుతున్నారు గురూజీ ఏం చేస్తాం చెప్పండి అంటూ దీనిపై స్పందించారు.

 

తాజాగా మరోసారి ఈ వివాదంపై మాట్లాడుతూ నిర్మాత SKN ఓ వీడియో రిలీజ్ చేసారు. SKN ఈ వీడియోలో మాట్లాడుతూ.. నేను ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్లో సరదాగా తెలుగు అమ్మాయిలతో పని చేయను అన్న మాటలను కొన్ని యూట్యూబ్ ఛానల్స్, వెబ్ సైట్స్ ఇకపై తెలుగు అమ్మాయిలతో చేయను అన్న SKN, తెలుగు అమ్మాయిలకు ఛాన్సులు ఇవ్వను అన్న SKN అని రాస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఎక్కువమంది తెలుగు అమ్మాయిలను ఇంట్రడ్యూస్ చేసిన నిర్మాత నేను. రేష్మ, ఆనంది, మానస, ప్రియాంక జవల్కర్, వైష్ణవి చైతన్య, ఐశ్వర్య, కుషిత.. వీళ్ళందర్నీ ఇప్పటివరకు ఇంట్రడ్యూస్ చేశాను, చేస్తున్నాను. రాబోయే సినిమాల్లో హారిక, ఇంకో కొత్త అమ్మాయి.. ఇలా దాదాపు 9 మంది తెలుగు అమ్మాయిలను హీరోయిన్స్ గా పరిచయం చేశాను. అలాగే ఈషా రెబ్బ, ఇనాయ, ప్రియా.. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ తెలుగు అమ్మాయిలతో కూడా పని చేస్తున్నాను. నా కెరీర్ లో నేను పనిచేసింది 80 శాతం తెలుగు అమ్మాయిలతోనే. నేను ఒక 25 మంది తెలుగు అమ్మాయిలను వివిధ రంగాల్లో పరిచయం చేశాను. మనం పరిచయం చేసిన వాళ్లంతా టాప్ కి వెళ్ళిపోరు, కిందకు వెళ్ళిపోరు. కానీ అవకాశం ఇవ్వడం ఇంపార్టెంట్. నా నెక్స్ట్ మూడు సినిమాల్లో హీరోయిన్స్, ఆర్ట్ డైరెక్టర్, ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్, రైటర్ తెలుగు అమ్మాయిలే. నేనేదో ఫన్ గా మాట్లాడిన మాటలని ఏదో స్టేట్మెంట్ లాగా రుద్దొద్దు. దాన్ని స్ప్రెడ్ చేయొద్దు అని నా కోరిక. ఈ రోజుల్లో ఇంతమంది అమ్మాయిలను ఎవరూ పరిచయం లేదు. జోక్ ని జోక్ గా తీసుకోండి. ఈ విషయాన్నీ ఇంతటితో వదిలేయండి అని క్లారిటీ ఇచ్చారు.

Also Read : Pushpa 2 Final Collections : ‘పుష్ప 2’ మూవీ 2000 కోట్లు వసూలు చేయలేదా..? ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన మూవీ యూనిట్.. ‘దంగల్’ రికార్డ్ సేఫ్..?

దీంతో వస్తున్న వార్తలకు సమాధానం ఇస్తూనే ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చారు. ఇప్పటివరకు నిర్మాతగా SKN పరిచయం చేసింది తన సినిమాల్లో ఆల్మోస్ట్ తెలుగమ్మాయిలే. ఆరోజు సరదాగా అన్న మాటలకు రియాలిటీ మర్చిపోయి పలువురు సోషల్ మీడియాలో ట్రోల్ చేసారు.