Rajasaab Movie
Rajasaab Movie : పండగలకు ఒకేసారి రెండు మూడు సినిమాలు వస్తుంటాయి. ఈ సారి సంక్రాంతికి 5 తెలుగు సినిమాలు రిలీజ్ కి ఉన్నాయి. ఇలాంటి సమయంలో థియేటర్స్ ఇష్యూ మాములే. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ గట్టిగా ఉన్నవాళ్లు తమ సినిమాలకు థియేటర్స్ ని బ్లాక్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు సంక్రాంతికి కూడా పెద్ద హీరోలే ఉండటంతో థియేటర్స్ ఇష్యూ వచ్చేలానే ఉంది.(Rajasaab Movie)
అయితే ఇటీవల ప్రభాస్ సినిమాకు థియేటర్స్ ఇష్యూ ఉందని వార్తలు వచ్చాయి. ప్రభాస్ రాజాసాబ్ సినిమా జనవరి 9న రిలీజ్ కానుంది. అదే రోజు తమిళ్ సినిమా జన నాయగన్ తెలుగు రిలీజ్ కూడా ఉంది కాబట్టి ఆ సినిమాకు థియేటర్స్ వెళతాయని సోషల్ మీడియాలో వార్తలు నడిచాయి.
Also Read : Chiranjeevi Venkatesh : చిరు – వెంకీ ఒకే స్టేజి మీద.. చిరు ముందు డ్యాన్స్ వేసిన వెంకటేష్.. ఫొటోలు వైరల్..
దీంతో నిన్న రాత్రి రాజాసాబ్ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించగా ఈ ప్రెస్ మీట్ లో నిర్మాత SKN థియేటర్స్ ఇష్యూపై స్పందించారు.
SKN మాట్లాడుతూ.. పండక్కి ఒకేసారి అన్ని సినిమాలు వస్తుంటే థియేటర్స్ సమస్య వస్తూ ఉంటుంది. విశ్వప్రసాద్ గారు ఆయన మిరాయ్ సినిమా బాగా ఆడుతున్నప్పటికీ వేరే సినిమాలు వస్తే అయన సినిమా తీసేసి మరీ థియేటర్స్ ఇచ్చారు. అలాంటి మంచి మనిషి. అలాంటి నిర్మాత సినిమా వస్తున్నప్పుడు, తెలుగు సినిమా పాన్ ఇండియా అయ్యేలా చేసిన ప్రభాస్ గారి సినిమా వస్తున్నప్పుడు ఇండస్ట్రీ పెద్దలు అంతా కోపరేట్ చేస్తారని, అలా కోపరేట్ చేసిన వాళ్ళందరి పేర్లు కూడా ఈ పండగ అయ్యాక ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను చెప్పాలి అనుకుంటున్నాను. ఆ ప్రెస్ మీట్ లో అందరి పేర్లు ఉండాలని కోరుకుంటున్నా. నాకు థియేటర్ ఇస్తే వంద సార్లు చెప్పుకుంటాను. అదే థియేటర్ ఇవ్వకపోతే రెండొందల సార్లు చెప్తాను అది నా నైజాం అని అన్నారు.
Also Read : Chiranjeevi : నేను ఎమోషనల్ అయ్యాను.. వెంకటేష్ తో ఫుల్ సినిమాకు రెడీ.. చిరంజీవి స్పీచ్..
దీంతో SKN వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. అయితే నిన్న రాత్రే జన నాయగన్ సినిమా సెన్సార్ ఇబ్బందులతో రిలీజ్ వాయిదా వేసినట్టు మూవీ యూనిట్ ప్రకటించారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో నేడు జనవరి 8 రాత్రి ప్రీమియర్స్ నుంచి 11 వ తేదీ వరకు అన్ని థియేటర్స్ లో రాజాసాబ్ సినిమా ఆడనుంది. 12 నుంచి మిగతా సంక్రాంతి సినిమాలు రానున్నాయి. మొదటి మూడు రోజులు అయితే ప్రభాస్ సినిమాకు థియేటర్స్ ఇష్యూ లేనట్టే.