Chiranjeevi : నేను ఎమోషనల్ అయ్యాను.. వెంకటేష్ తో ఫుల్ సినిమాకు రెడీ.. చిరంజీవి స్పీచ్..
నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. (Chiranjeevi)
Chiranjeevi
- మన శంకర వరప్రసాద్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్
- చిరంజీవి స్పీచ్
- వెంకటేష్ తో ఇంకో సినిమా చేయడానికి రెడీ
Chiranjeevi : అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా సంక్రాంతికి జనవరి 12న రిలీజ్ కానుంది. నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సినిమాలో వెంకటేష్ గెస్ట్ రోల్ లో నటించారు. దీంతో ఈవెంట్ కి వెంకటేష్ కూడా హాజరయ్యారు. ఇక ఈ సినిమాని నిర్మాత సాహు గారపాటి తో పాటు చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల కూడా నిర్మించింది.(Chiranjeevi)
Also See : తమ్ముడు మహేష్, పవన్ తో చేశాను.. ఇప్పుడు అన్నయ్యతో.. వెంకటేష్ ఫుల్ స్పీచ్..
Chiranjeevi
ఈ సినిమా ఈవెంట్లో చిరంజీవి మాట్లాడుతూ.. రాఘవేంద్రరావు ఎప్పుడో అన్నాడు అనిల్ రావిపూడి సినిమాలు బాగుంటున్నాయి. నువ్వు ఆయనతో ఒక సినిమా చేస్తే చూడాలని ఉంది అన్నారు. ఆయన చేతుల మీదుగానే ఈ సినిమా ఓపెనింగ్ అయింది. ఆయన సెట్ కి వస్తారనుకున్నా కానీ కుదరలేదు. SPG పాత్ర అన్నారని డిఫరెంట్ గా ఉండాలి అనుకున్నాను. కానీ నా పాత సినిమాల్లో ఎలా చేసానో అలాగే కావాలి అన్నాడు అనిల్. అప్పటి ప్రేక్షకులు పాత చిరంజీవిని గుర్తుచేసుకుంటారు అన్నాడు. ఈ జనరేషన్ వాళ్ళు తెలుసుకుంటారు అన్నాడు. పాత సినిమాల్లో నా కామెడీ టైమింగ్స్ అన్ని తీసుకొచ్చి దాని మీద హోమ్ వర్క్ చేసి చేసాడు.
ఈ సినిమా అయ్యాక నేను ఎమోషనల్ అయ్యాను. ఒక ఫేర్ వెల్ పార్టీలా అనిపించింది. అనిల్ కూడా అదే ఫీలింగ్ ఉంది అన్నాడు. ప్రతిరోజూ సరదాగా ఉండేది సెట్ లో షూటింగ్. ఈ మధ్యకాలంలో ఇంత సరదాగా జరిగిన సినిమాలు లేవు. సీన్స్ అన్ని మాతో నడిపించిన అనిల్ రావిపూడి కి మాత్రమే క్రెడిట్ చెందుతుంది. ఇలాంటి డైరెక్టర్ దొరికితే ఎవరికైనా ఈజీ. బడ్జెట్ పరంగా, డేస్ పరంగా అద్భుతంగా లిమిట్ లో తీయగలిగాడు డైరెక్టర్. ఇదే సినిమాకు మొదటి సక్సెస్. ఇటీవల కాలంలో అలాంటి సినిమాలు తక్కువ.
Also Read : Sushmita Konidela : తమ్ముడు చరణ్ గురించి అక్క స్పీచ్.. ఎమోషనల్ అయిన చిరంజీవి..
Chiranjeevi
వెంకటేష్ ఎప్పుడూ లైఫ్, ఫిలాసఫీ మాట్లాడతాడు. చిన్న సైజ్ గురువుగా అనిపిస్తాడు. అయిదేళ్ల క్రితం మేమిద్దరం అమెరికా వెళ్ళాము. అప్పుడు ఒకరింట్లో ఫొటో తీస్తాం అంటే వెంకటేష్ మీరు కూర్చోండి నేను వెనుక నిలబడతాను అలా బాగుంటుంది అన్నాడు. అప్పుడే ఈ ఆలోచన వచ్చింది. వెంకటేష్ కూడా నా వెనక ఉండేలా అడిగాడు అలాంటి కథ. అప్పట్నుంచి మనసులో ఉండిపోయింది. ఇపుడు నేను అనిల్ రావిపూడి కి హింట్ ఇచ్చాను. అతను పర్ఫెక్ట్ గా సెట్ చేసాడు మా ఇద్దర్ని. సెట్ లో మేమిద్దరం సరదాగా అల్లరి చేసాము. వెంకటేష్ తో నేను ఫుల్ సినిమా చేయడానికి రెడీ. మేమిద్దరం చేస్తాం అనిల్ రావిపూడి కథ రెడీ చేసుకో.
అసలు నయనతార ప్రమోషన్స్, సరదాగా ఉండటం ఏంటో అనిల్ ఎలా ఒప్పించాడో, ఆమెతో నేను రెండు సినిమాలు చేశాను ఎప్పుడూ ఇలా లేదు. ఆ సీక్రెట్ ఏంటో అనిల్ కే తెలియాలి. నేను ఇప్పటివరకు చేయనిది ర్యాప్ సాంగ్. ఈ సినిమాలో చేశాను. కొత్తగా ఉంది. థియేటర్లో హైలెట్ అవుతుంది. ఈ సినిమా కెమెరామెన్ సమీర్ చాలా ఫాస్ట్ గా వర్క్ చేస్తాడు. అందరు కెమెరా మేన్స్ అలా ఉంటే సినిమా వర్కింగ్స్ డేస్ చాలా తగ్గుతాయి. 100 రోజుల లోపే షూటింగ్ అయిపోతాయి సినిమాలు.
ఈ సినిమాకు నిర్మాతగా నా బిడ్డ కష్టం చూసి అయ్యో పాపం అనిపించేది ఒక్కోసారి. కానీ నిర్మాతగా చేసింది. తనకు ఏ పని చేయకపోయినా గడుస్తుంది. కానీ ఏదో సాధించాలని నిర్మాతగా మారింది. తనని చూసి ఎందరో ఇన్ స్పైర్ అవుతారు. తాను నా బిడ్డ. తాను ఇలాగే ముందుకెళ్లాలి కష్టపడుతూ అని తెలుపుతూ సినిమా గురించి, సినిమాకు పనిచేసిన వారి గురించి మాట్లాడారు.
