Producer SKN
Producer SKN : ఇటీవల శివాజీ దండోరా సినిమా ఈవెంట్లో అమ్మాయిలు, హీరోయిన్స్ చక్కగా చీరలు కట్టుకోండి, మంచి బట్టలు వేసుకోండి అని చెప్తూ పొరపాటున ఓ రెండు అసభ్యకరమైన పదాలు మాట్లాడటంతో కొంతమంది శివాజీపై విమర్శలు చేస్తున్నారు. అమ్మాయిలకు మీరెవరు చెప్పడానికి, అమ్మాయిలపై మీ కంట్రోల్ ఏంటి అంటూ పలువురు శివాజీపై విమర్శలు చేస్తున్నారు. కొంతమంది మాత్రం శివాజీ పదాలు తప్పుగా వాడినా మంచి విషయమే చెప్పాడు అని సపోర్ట్ చేస్తున్నారు.(Producer SKN)
ఇప్పటికే ఇండస్ట్రీలోనే అనసూయ, చిన్మయి, ఝాన్సీ, నాగబాబు, ప్రకాష్ రాజు, బివిఎస్ రవి.. ఇలా పలువురు నటీనటులు శివాజీని తప్పు పడుతూ కామెంట్స్ చేసారు. తాజాగా నిర్మాత SKN కూడా శివాజీపై కామెంట్స్ చేసారు. నేడు పతంగ్ సినిమా సక్సెస్ మీట్ కి హాజరయిన SKN సినిమా గురించి మాట్లాడిన అనంతరం శివాజీపై కామెంట్స్ చేసారు.
Also Read : Sivaji Issue : శివాజీకే సపోర్ట్ అంటున్న సోషల్ మీడియా.. ఆ రెండు పదాలు తప్ప.. సెలబ్రిటీలు వర్సెస్ నెటిజన్లు..
నిర్మాత SKN మాట్లాడుతూ.. అమ్మాయిలు, హీరోయిన్స్ మీకు ఏ డ్రెస్ కంఫర్ట్ గా ఉంటే ఆ డ్రెస్ వేసుకోండి. ఏ డ్రెస్ కాన్ఫిడెన్స్ గా ఉంటే అది వేసుకోండి. ఏ బట్టల సత్తి గాడి మాటలు వినక్కర్లేదు. కాన్ఫిడెన్స్ అనేది గుండెలోంచి వస్తుంది. వేసే బట్టల్లోంచి కాదు. ఏం జరిగినా మన మనసు నుంచే ఉంటుంది. మనసు బాగుంటే అన్ని మంచిగానే అనిపిస్తాయి అని అన్నారు. దీంతో శివాజీని ఇలా బట్టల సత్తిగాడు అని వ్యాఖ్యానిస్తూ కామెంట్స్ చేయడంతో SKN మాటలు కూడా వైరల్ గా మారాయి.