Producer Srinivasaa : అప్పుడు సమంతకు.. ఇప్పుడు నాగ చైతన్యకు కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమాలు ఇచ్చాం..

నిర్మాత చిట్టూరి శ్రీనివాస రావు మాట్లాడుతూ.. సినీ పరిశ్రమలో 20 ఏళ్లుగా ఉన్నాను. సినిమాలు ఫ్లాప్ అయినా కథ నచ్చితే దానికి తగ్గ బడ్జెట్ పెట్టి సినిమాను తీశాం. U టర్న్ సినిమా చేసేటప్పటికీ సమంతకి సింగిల్ గా అంత మార్కెట్ లేదు. కానీ మేము సినిమాకు భారీ బడ్జెట్ పెట్టి తీశాం.

Producer Srinivasaa :  నాగచైతన్య(Naga Chaitanya), కృతిశెట్టి(Krithi Shetty) జంటగా వెంకట్ ప్రభు(Venkat Prabhu) దర్శకత్వంలో తెరకెక్కిన కస్టడీ(Custody) సినిమా మే 12న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. చిత్ర యూనిట్ గత కొద్ది రోజులుగా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ప్రమోషన్స్ లో భాగంగా సినిమా నిర్మాత చిట్టూరి శ్రీనివాస ఇంటర్వ్యూ ఇవ్వగా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

నిర్మాత చిట్టూరి శ్రీనివాస మాట్లాడుతూ.. సినీ పరిశ్రమలో 20 ఏళ్లుగా ఉన్నాను. సినిమాలు ఫ్లాప్ అయినా కథ నచ్చితే దానికి తగ్గ బడ్జెట్ పెట్టి సినిమాను తీశాం. U టర్న్ సినిమా చేసేటప్పటికీ సమంతకి సింగిల్ గా అంత మార్కెట్ లేదు. కానీ మేము సినిమాకు భారీ బడ్జెట్ పెట్టి తీశాం. కథ నచ్చి, దానికి తగ్గట్టు ఖర్చుపెట్టాం. అప్పటికి అదే సమంత కెరీర్ లో లేడీ ఓరియెంటెడ్ కి భారీ బడ్జెట్ సినిమా. ఆ సినిమాని కూడా తెలుగు, తమిళ్ లో నిర్మించాం. మంచి విజయం సాధించింది. ఇప్పుడు కస్టడీ సినిమా కుడా నాగ చైతన్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమా. కథ బాగుంది, హిట్ అవుతుంది అనే నమ్మకంతోనే అంత బడ్జెట్ పెట్టాము. ఈ సినిమాని కూడా తెలుగు, తమిళ్ లో తీశాము. డైరెక్టర్ వెంకట్ ప్రభుతో గ్యాంబ్లర్ సినిమా నుంచి తీద్దాం అనుకుంటున్నాం. U టర్న్ తీసినప్పుడే నాగ చైతన్యతో తీద్దాం అనుకున్నాం. ఇన్నాళ్లకు వీరిద్దరి కాంబినేషన్ కుదిరింది అని అన్నారు.

Telangana Secretariat : తెలంగాణ కొత్త సెక్రటేరియట్ ఫస్ట్ ఏ సినిమాలో కనిపించిందో తెలుసా?

ఇక సమంత U టర్న్ సినిమాకు దాదాపు 15 కోట్ల బడ్జెట్ పెట్టగా దాదాపు 25 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు నాగ చైతన్య కస్టడీ సినిమాకు ఏకంగా 35 కోట్ల బడ్జెట్ పెట్టారు. ఇలా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ సంస్థ సమంతకు, నాగ చైతన్యకు కెరీర్ లో మొదటిసారి భారీ బడ్జెట్ సినిమాలు ఇచ్చారు.

ట్రెండింగ్ వార్తలు