Telangana Secretariat : తెలంగాణ కొత్త సెక్రటేరియట్ ఫస్ట్ ఏ సినిమాలో కనిపించిందో తెలుసా?

తెలంగాణ కొత్త సచివాలయం అద్భుతంగా ఉండటంతో ఇప్పటికే పలువురు దాని ముందు ఫోటోషూట్స్ చేసుకుంటున్నారు. ఇక రాత్రి పూట అయితే ధగధగ మెరుస్తుండటంతో మరింతమంది ఫోటోలు, వీడియోలు తీసుకుంటున్నారు సచివాలయం ముందు.

Telangana Secretariat : తెలంగాణ కొత్త సెక్రటేరియట్ ఫస్ట్ ఏ సినిమాలో కనిపించిందో తెలుసా?

Telangana new Secretariat appears first time in Ramabanam Movie

Updated On : May 11, 2023 / 7:20 AM IST

Telangana Secretariat : మంచి మంచి లొకేషన్స్ పట్టుకుని మరీ సినిమా వాళ్ళు షూటింగ్స్ చేస్తారు. ఇటీవల హైదరాబాద్(Hyderabad) లో కొత్త కొత్త కట్టడాలు చాలా వస్తుండటంతో పర్యాటక ప్రదేశంగా మారడమే కాకుండా సినిమా వాళ్లకు కూడా మంచి లొకేషన్స్ లాగా పనికొస్తున్నాయి. కొని రోజుల క్రితమే తెలంగాణ(Telangana) కొత్త సెక్రటేరియట్(Secretariat) ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. 28 ఎకరాల విస్తీర్ణంలో 8 ఎకరాల పచ్చదనంతో 265 అడుగుల ఎత్తుగా భారీగా తెలంగాణ కొత్త సచివాలయాన్ని నిర్మించారు. బిల్డింగ్ పైన ఉన్న డోమ్స్ తో, వాటిపై ఏర్పాటు చేసిన జాతీయ చిహ్నం, చాలా దూరం నుంచి చూసినా అద్భుతంగా కనపడేలా తెలంగాణ సచివాలయాన్ని నిర్మించారు.

ఇప్పుడు ఇది తెలంగాణలో మరో అద్భుత కట్టడంగా నిలిచి పర్యాటకులను ఆకర్షిస్తుంది. నెక్లేస్ రోడ్, హుస్సేన్ సాగర్.. ఆ చుట్టూ పక్కల ఇప్పటికే ఫోటోషూట్స్, సినిమా షూట్స్, వీడియో షూట్స్ తో ఎప్పుడూ బిజీగా అంటుంది. చాలా సినిమాల్లో ఆ చుట్టుపక్కల పరిసరాలను చూపించారు. ఇప్పుడు తెలంగాణ కొత్త సచివాలయం అద్భుతంగా ఉండటంతో ఇప్పటికే పలువురు దాని ముందు ఫోటోషూట్స్ చేసుకుంటున్నారు. ఇక రాత్రి పూట అయితే ధగధగ మెరుస్తుండటంతో మరింతమంది ఫోటోలు, వీడియోలు తీసుకుంటున్నారు సచివాలయం ముందు.

Allu Arjun : 30 ఏళ్ళ తర్వాత ఆమెను కలిసిన అల్లు అర్జున్.. కాళ్లకు నమస్కారం చేసి ఆమె నంబర్ 1 అంటూ ఎమోషనల్..

తాజాగా తెలంగాణ కొత్త సచివాలయం మొదటిసారిగా ఓ సినిమాలో కనిపించింది. ఇటీవల గోపీచంద్ హీరోగా రామబాణం సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. గోపీచంద్, డింపుల్ హయతి జంటగా జగపతి బాబు, కుష్బూ ముఖ్య పాత్రల్లో శ్రీవాస్ దర్శకత్వంలో వచ్చిన రామబాణం సినిమా పర్వాలేదనిపించింది. ఈ సినిమాలో ఒక ఎమోషనల్ సాంగ్ లో గోపీచంద్ తెలంగాణ సెక్రటేరియట్ ముందు, నెక్లేస్ రోడ్, హుస్సేన్ సాగర్ పరిసరాల్లో తిరుగుతూ ఉంటాడు. గోపీచంద్ వెనకాల అప్పుడప్పుడే దాదాపు పూర్తి అయిన తెలంగాణ సచివాలయం చాలా అద్భుతంగా కనపడింది. ఇది సచివాలయం ప్రారంభానికి ముందే షూట్ చేసినట్లు తెలుస్తుంది. దీంతో సినిమాలో ఈ షాట్ చూసిన వాళ్ళు అప్పుడే తెలంగాణ సచివాలయాన్ని సినిమాల్లో వాడేసారా అని ఆశ్చర్యపోతున్నారు. ముందు ముందు తెలంగాణ సచివాలయం ఇంకెన్ని సినిమాల్లో కనిపిస్తుందో అని ఆలోచిస్తున్నారు ప్రేక్షకులు. ఇప్పటికే హైదరాబాద్ లోని అనేక ముఖ్యమైన ప్రాంతాలను, అందంగా ఉండే లొకేషన్స్ ను సినిమాల్లో వాడేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ సచివాలయం కూడా అదే కోవలోకి చేరనుంది.