Allu Arjun : 30 ఏళ్ళ తర్వాత ఆమెను కలిసిన అల్లు అర్జున్.. కాళ్లకు నమస్కారం చేసి ఆమె నంబర్ 1 అంటూ ఎమోషనల్..

అవార్డుల కార్యక్రమంలో బిహైండ్‌వుడ్స్ అల్లు అర్జున్ కి ఓ సర్‌ప్రైజ్ ఇచ్చింది. అవార్డు అందుకున్నాక బన్నీ మాట్లాడేముందు ఓ పెద్దావిడను స్టేజి మీదకు పిలిచారు. ఆమెను చూసి బన్నీ ఆశ్చర్యపోయారు.

Allu Arjun : 30 ఏళ్ళ తర్వాత ఆమెను కలిసిన అల్లు అర్జున్.. కాళ్లకు నమస్కారం చేసి ఆమె నంబర్ 1 అంటూ ఎమోషనల్..

Allu Arjun emotional after meet his teacher after 30 years

Allu Arjun :  మనకు ఇష్టమైన వ్యక్తులను, లేదా బాగా తెలిసిన వ్యక్తులను చాలా సంవత్సరాల తర్వాత కలిస్తే ఒకరకమైన ఆనందానికి లోనవుతాము. ఆ మూమెంట్ ని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఐకాన్ స్టార్(Icn Star) అల్లు అర్జున్(Allu Arjun) ఇప్పుడు అదే ఫీల్ అవుతున్నాడు. తమిళ(Tamil) సినీ పరిశ్రమకు చెందిన బిహైండ్‌వుడ్స్ అనే ఓ సంస్థ ఇటీవల కొన్ని రోజుల క్రితం అవార్డుల కార్యక్రమం నిర్వహించగా ఇందులో గోల్డెన్ ఐకాన్ అఫ్ ది ఇయర్ గా అల్లు అర్జున్ కి అవార్డు అందించారు. రెహమాన్ చేతుల మీదుగా బన్నీ ఈ అవార్డు అందుకున్నారు.

అయితే ఈ అవార్డుల కార్యక్రమంలో బిహైండ్‌వుడ్స్ అల్లు అర్జున్ కి ఓ సర్‌ప్రైజ్ ఇచ్చింది. అవార్డు అందుకున్నాక బన్నీ మాట్లాడేముందు ఓ పెద్దావిడను స్టేజి మీదకు పిలిచారు. ఆమెను చూసి బన్నీ ఆశ్చర్యపోయారు. ఆమె పేరు అంబికా కృష్ణన్. బన్నీ చిన్నప్పటి స్కూల్ టీచర్. ఆమె స్టేజి మీదకు రావడంతోనే బన్నీ ఆమెను ఆప్యాయంగా దగ్గరికి తీసుకొని ఆమె కాళ్లకు నమస్కరించాడు. అనంతరం ఆ టీచర్ మాట్లాడుతూ.. చిన్నప్పుడు అల్లు అని పిలిచేదాన్ని. ఇతను నాకు బాగా గుర్తున్నాడు. నా చిన్నప్పటి స్టూడెంట్ ఇప్పుడు ఇంత ఎత్తుకు ఎదగడం చాలా ఆనందంగా ఉంది. అర్జున్ చిన్నప్పుడే డ్యాన్సింగ్ షూస్ తో పుట్టి ఉంటాడు. అర్జున్ మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను అని అన్నారు.

Tovino Thomas : బాలీవుడ్ సినిమాల ప్రమోషన్స్ బడ్జెట్ అంత కూడా ఉండవు మా సినిమాల బడ్జెట్స్..

ఇక బన్నీ మాట్లాడుతూ.. ఈమె పేరు అంబికా మేడం. నా చిన్నప్పటి క్లాస్ టీచర్. నాకు జాగ్రఫీ చెప్పేవాళ్ళు. ఈమె నాకు ఎప్పటికి గుర్తుంటారు. నా ఫేవరేట్ టీచర్. నాకు చాలా మంది టీచర్స్ ఉన్నా వారిలో ఈమె నంబర్ 1 ప్లేస్ లో ఉంటారు. ఎందుకంటే నేను చిన్నప్పుడు చదువులో చాలా బ్యాడ్ స్టూడెంట్ ని. క్లాస్ లో 50 మంది ఉంటే నాది చివరి ర్యాంక్. వేరే టీచర్స్ నన్ను తిట్టినా, ఈ మేడం మాత్రం ఎప్పుడూ తిట్టలేదు. ఆమె నాకు.. జీవితం అంటే చదువు ఒక్కటే కాదు. మార్కులు సరిగ్గా రాలేదని బాధపడకు, అందరిలోనూ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. నీకు ఆ టాలెంట్ నిన్ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుంది అని చెప్పారు. ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు ఇలా మేడంను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది అని అన్నారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. బన్నీ ఫ్యాన్స్ ఈ వీడియోని తెగ షేర్ చేస్తున్నారు.