Tovino Thomas : బాలీవుడ్ సినిమాల ప్రమోషన్స్ బడ్జెట్ అంత కూడా ఉండవు మా సినిమాల బడ్జెట్స్..

ఎంత మంచి సినిమాలు వస్తున్నా మలయాళం సినిమా మార్కెట్ మాత్రం పెరగట్లేదు. 100 కోట్ల సినిమా అంటే ఇప్పటికి మలయాళంలో కష్టమే. తాజాగా దీనిపై మలయాళం స్టార్ హీరో టోవినో థామస్ కామెంట్స్ చేశారు.

Tovino Thomas : బాలీవుడ్ సినిమాల ప్రమోషన్స్ బడ్జెట్ అంత కూడా ఉండవు మా సినిమాల బడ్జెట్స్..

Tovino Thomas on their Malayalam Movie Market

Tovino Thomas :  ఒకప్పుడు కేరళ(Kerala) మలయాళం సినిమాలు అంటే ఎవరూ పట్టించుకునే వారు కాదు. కానీ గత కొన్నాళ్లుగా కేరళ సినిమాలు అద్భుతాలు సృష్టిస్తున్నాయి. అన్ని జోనర్స్ లోను తక్కువ బడ్జెట్ లోనే భారీ హిట్ సినిమాలు రూపొందిస్తున్నారు. కరోనా సమయంలో ఓటీటీ(OTT) వచ్చాక మలయాళం(Malayalam) సినిమాలు మరింత పాపులర్ అయ్యాయి. మలయాళంలో ఇంత మంచి సినిమాలు వస్తున్నాయా అని వేరే భాషల ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ఇక మన తెలుగులో(Telugu) అయితే ఇటీవల కాలంలో కనీసం ఓ 10 మలయాళ సినిమాల రీమేక్ రైట్స్ కొనుక్కొని సినిమాలు తీస్తున్నారంటే ఏ రేంజ్ లో మలయాళం సినిమాలు మెప్పిస్తున్నాయో అర్ధం చేసుకోవచ్చు.

ఎంత మంచి సినిమాలు వస్తున్నా మలయాళం సినిమా మార్కెట్ మాత్రం పెరగట్లేదు. 100 కోట్ల సినిమా అంటే ఇప్పటికి మలయాళంలో కష్టమే. తాజాగా దీనిపై మలయాళం స్టార్ హీరో టోవినో థామస్ కామెంట్స్ చేశారు. టోవినో తాజాగా 2018 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. 2018లో కేరళలో వచ్చిన వరదల మీద ఈ సినిమాని తీశారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో టోవినో థామస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

The Kerala Story : ది కేరళ స్టోరీ ఏ ఓటీటీలో ప్రసారం కానుంది తెలుసా?

టోవినో థామస్ మాట్లాడుతూ.. మరింతమంది డిస్ట్రిబ్యూటర్స్ మా కేరళ సినిమాలని చూడాలనుకుంటున్నాను. చూసి కొనాలనుకుంటున్నాను. వాటిని మేము ప్రేమతో ఫ్రీ గా ఇవ్వలేం. ఓటీటీలో రిలీజ్ అయ్యాక, టెలిగ్రామ్ లో పైరసీలో చూశాకా మలయాళం సినిమాలు బాగున్నాయి అనే కామెంట్స్ పనికిరావు. దేశం మొత్తానికి మా సినిమాని తీసుకెళ్లడం మాకు కష్టం. మా సినిమాల బడ్జెట్ బాలీవుడ్ లో పెద్ద సినిమాల ప్రమోషన్స్ బడ్జెట్ కంటే కూడా తక్కువే. ఇదే మేము ఎక్కువ కష్టపడేలా చేసింది. సెట్ లో ఎక్కువ పనిచేసేలా చేసింది. తక్కువ రెమ్యునరేషన్స్ కూడా తీసుకుంటాం. అంత కష్టపడితేనే ఇలాంటి సినిమాలు వస్తున్నాయి. మేము ప్రమోషన్స్ కి ఎక్కువ డబ్బు కేటాయించం. సినిమా బాగుంటే అదే ప్రజల్లోకి వెళ్తుంది అని అన్నారు. దీంతో టీవీనో థామస్ చేసిన వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో చర్చగా మారాయి.