Producer Suryadevara Radhakrishna : సినీ పరిశ్రమలో విషాదం.. స్టార్ నిర్మాత తల్లి కన్నుమూత..

సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాదం చోటు చేసుకుంది.

Producer Suryadevara Radhakrishna mother passed away

Suryadevara Radhakrishna : సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాదం చోటు చేసుకుంది. ప్ర‌ముఖ సినీ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) త‌ల్లి సూర్యదేవర నాగేంద్రమ్మ క‌న్నుమూశారు. ఆమె వ‌య‌స్సు 90 సంవ‌త్స‌రాలు. గ‌త కొంత‌కాలంగా ఆమె హృద‌య సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డుతున్నారు. అనారోగ్యంతో పాటు వృద్ధాప్యం కార‌ణంగా గురువారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల స‌మ‌యంలో తుదిశ్వాస విడిచారు.

సూర్యదేవర నాగేంద్రమ్మకు ఇద్ద‌రు అబ్బాయిలు, ఇద్ద‌రు అమ్మాయిలు. ఆమెకు రాధాకృష్ణ రెండవ కొడుకు. నిర్మాత సూర్యదేవర నాగ వంశీకి నాగేంద్రమ్మ నాయనమ్మ అవుతారు. ఆమె అంత్య‌క్రియ‌లు రేపు (శుక్ర‌వారం) ఉద‌యం 10 గంట‌ల స‌మ‌యంలో ఫిల్మ్‌న‌గ‌ర్‌లోని విద్యుత్ శ్మ‌శాన వాటిక‌లో జ‌రుగుతాయ‌ని కుటుంబ స‌భ్యులు తెలిపారు.

Balakrishna : అంజలిని తోసేసిన బాలయ్య.. వివాదంపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత..