Balakrishna : అంజలిని తోసేసిన బాలయ్య.. వివాదంపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత..

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో బాలయ్య అంజలిని తోసేసాడు అని ఓ వీడియో వైరల్ అయింది.

Balakrishna : అంజలిని తోసేసిన బాలయ్య.. వివాదంపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత..

Balakrishna Anjali Gangs Of Godavari Pre Release Event Issue goes Viral Producer Naga Vamsi gives Clarity

Updated On : May 30, 2024 / 2:06 PM IST

Balakrishna : బాలయ్య బాబుని పొగిడేవాళ్లు ఉంటారు, తిట్టే వాళ్ళు ఉంటారు. ఒక్కోసారి బాలయ్య పబ్లిక్ లో చేసే పనులు వివాదాలుగా నిలుస్తాయి. ఇటీవల గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి బాలకృష్ణ గెస్ట్ గా వచ్చాడు. ఈ ఈవెంట్లో బాలయ్య అంజలిని తోసేసాడు అని ఓ వీడియో వైరల్ అయింది. దీంతో సోషల్ మీడియాలో బాలయ్యపై విమర్శలు చేస్తున్నారు. తెలుగువాళ్లే కాకుండా వేరే భాషా నెటిజన్లు కూడా బాలకృష్ణపై విమర్శలు చేస్తున్నారు.

ఒక స్టార్ హీరో అయి ఉండి అలా ఒక అమ్మాయిని తోసేయడం ఏంటని ట్రోలింగ్ చేస్తున్నారు. అయితే ఈ వీడియో సగమే కట్ చేసి ఇలా వైరల్ చేస్తున్నారని, ఫుల్ వీడియో చూడకుండా కావాలని బాలయ్య వ్యతిరేకులు ఇలా నెగిటివ్ గా ప్రచారం చేస్తున్నారని అభిమానులు అంటున్నారు. అసలు జరిగిందేంటి అంటే.. అక్కడ స్టేజి మీద ఫోటోలకు మధ్యలో నిల్చోవాలి. దీంతో బాలయ్యను మధ్యలోకి జరగమని పక్కన వాళ్ళు చెప్పడంతో పక్కనున్న అంజలికి చెప్పారు. ఈవెంట్లో సౌండ్ కి వినపడకపోవడంతో అంజలిని పక్కకు తోశారు. అంజలి పడిపోబోవడంతో పక్కనే ఉన్న నేహా శెట్టి పట్టుకుంది. అయితే బాలయ్య నవ్వుకుంటూ సరదాగానే తోసేసాడు, అంజలి కూడా ఇది సరదాగానే తీసుకుంది. ఆ తర్వాత ఇద్దరూ స్టేజి మీద మాట్లాడుకొని వెంటనే ఒకరికొకరు హైఫై ఇచ్చుకున్నారు.

Also Read : Vishwak Sen : మోక్షజ్ఞ అయన దగ్గర యాక్టింగ్‌లో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు.. త్వరలోనే ఎంట్రీ..

సోషల్ మీడియాలో బాలయ్య అంజలిని తోసేసే వరకే వీడియోలు కట్ చేసి వైరల్ చేశారు. దీంతో బాలయ్యని విమర్శిస్తున్నారు. అయితే సరదాగా చేసినా అలా పబ్లిక్ లో ఒక హీరోయిన్ ని తోయడం మాత్రం కరెక్ట్ కాదని అంటున్నారు. ఈ వివాదం పెద్దది అవడంతో తాజాగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా నిర్మాత నాగవంశీ, హీరో విశ్వక్ సేన్ దీనిపై క్లారిటీ ఇచ్చాడు.

నాగవంశీ ఇవాళ జరిగిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. అక్కడ స్టేజి మీద కొంతమంది ఉన్నారు. పక్కకి జరగాలి, వినపడకపోవడంతో క్యాజువల్ గా తోశారు. ఆ వీడియో ముందు, వెనక ఏం జరిగిందో ఎవరు చూడరు. ఆ తోసేయడం చూసి నెగిటివ్ చేస్తున్నారు. దాని తర్వాత హైఫై ఇచ్చింది ఎవరు షేర్ చెయ్యట్లేదు. కొంతమంది బాలయ్య గారిని నెగిటివ్ చేయాలి అనుకునే వాళ్ళు ప్లాన్ చేసి చేస్తున్నారు. దాన్ని ఎందుకు మీరు హైప్ ఇస్తున్నారు అని అన్నారు. మొత్తానికి మరోసారి బాలయ్య వివాదంలో నిలిచారు.