Vishwak Sen : మోక్షజ్ఞ అయన దగ్గర యాక్టింగ్‌లో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు.. త్వరలోనే ఎంట్రీ..

బాలయ్య కూడా ఇప్పటికే చాలా సార్లు మోక్షజ్ఞ సినిమాలోకి వస్తాడు అనే చెప్పారు.

Vishwak Sen : మోక్షజ్ఞ అయన దగ్గర యాక్టింగ్‌లో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు.. త్వరలోనే ఎంట్రీ..

Vishwak Sen Gives Clarity on Balakrishna Son Mokshagna Tollywood Entry

Updated On : May 30, 2024 / 1:10 PM IST

Vishwak Sen : గత కొన్నేళ్ల నుంచి బాలకృష్ణ(Balakrishna) తనయుడు మోక్షజ్ఞ(Mokshagna) సినిమాల్లోకి వస్తాడు అని చెప్తూనే ఉన్నారు కానీ ఎలాంటి అధికారిక ప్రకటన ఇప్పటిదాకా రాలేదు. నందమూరి అభిమానులు బాలయ్య వారసుడి ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నారు. మోక్షజ్ఞ బయట ఎక్కడైనా కనిపించి ఫోటోలు లీక్ అయితే అవి వైరల్ అవ్వాల్సిందే. బాలయ్య కూడా ఇప్పటికే చాలా సార్లు మోక్షజ్ఞ సినిమాలోకి వస్తాడు అనే చెప్పారు.

ఇటీవల గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా బాలకృష్ణ మాట్లాడుతూ.. నా తనయుడు మోక్షజ్ఞ కూడా సినీ రంగంలోకి వస్తాడు. వాడికి నన్ను చూసి ఏం నేర్చుకోవద్దు అని చెప్పాను. ఈ తరం హీరోలు విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ, అడివి శేష్.. లాంటి వాళ్ళని చూసి నేర్చుకోమని చెప్తాను అని అన్నారు. దీంతో మోక్షజ్ఞ సినిమాల్లోకి వస్తాడు అని మరోసారి క్లారిటీ ఇచ్చారు.

Also Read : Vijay Deverakonda : విజయ్ దేవరకొండ సినిమాలో ఈ హీరో గెస్ట్ రోల్ చేస్తున్నాడా..?

అయితే తాజాగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ప్రమోషన్స్ లో విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. మోక్షజ్ఞ త్వరలోనే ఎంట్రీ ఇస్తాడు. ఆల్రెడీ సత్యానంద్ గారి దగ్గర యాక్టింగ్ నేర్చుకుంటున్నాడు అని తెలిపాడు. దీంతో విశ్వక్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. యాక్టింగ్ లో మెళకువలు నేర్చుకుంటున్నాడు అంటే త్వరలోనే బాలయ్య వారసుడి ఎంట్రీ ఉంటుందని అభిమానులు సంతోషిస్తున్నారు.

ప్రభాస్, పవన్ కళ్యాణ్.. ఇలా ఎంతోమంది టాలీవుడ్ స్టార్స్ సత్యానంద్ దగ్గరే యాక్టింగ్ నేర్చుకున్నారు. ఇప్పుడు బాలయ్య వారసుడు కూడా ఆయన దగ్గరే నేర్చుకోవడం గమనార్హం. మరి మోక్షజ్ఞ తన మొదటి సినిమాతో నందమూరి అభిమానులని, ప్రేక్షకులని ఏ రేంజ్ లో మెప్పిస్తాడో చూడాలి.