Vijaypal Reddy
Vijaypal Reddy : ఏ మారుతి టీం ప్రొడక్ట్, వానరా సెల్యూలాయిడ్, జీ స్టూడియో బ్యానర్లపై విజయ్ పాల్ రెడ్డి అడిదల నిర్మాణంలో తెరకెక్కిన సినిమా ‘బ్యూటీ’. అంకిత్ కొయ్య, నీలఖి, నరేష్, వాసుకి ముఖ్య పాత్రల్లో ఈ సినిమా నిర్మించారు. బ్యూటీ సినిమా సెప్టెంబర్ 19న రిలీజ్ కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా బ్యూటీ సినిమా నిర్మాత విజయ్ పాల్ రెడ్డి నేడు మీడియాతో మాట్లాడుతూ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపారు.(Vijaypal Reddy)
బ్యూటీ జర్నీ గురించి చెప్తూ.. ఇప్పటివరకు బ్యూటీ జర్నీ బాగా సాగింది. టైటిల్ ఎంతో క్యాచీగా ఉండటంతో జనాల్లోకి వెళ్లింది. ఇప్పటి వరకు సినిమా చూసిన వాళ్ళు మూవీని మెచ్చుకున్నారు. బ్యూటీ కథలో అందమైన ప్రేమ కథతో పాటు మనసుని కదిలించే ఎమోషన్స్ ఉంటాయి. ప్రతీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చూడాల్సిన సినిమా ఇది. నాకు పర్సనల్‌గా ఎమోషనల్ సీన్స్ అంటే ఇష్టం. ఈ కథలోని ఎమోషన్స్ నచ్చే సినిమాను నిర్మించేందుకు ముందుకు వచ్చాను అని తెలిపారు.
Also Read : OG Movie : భారీగా OG టికెట్ ధరలు పెంపు.. బెనిఫిట్ షో టికెట్ ఎంతంటే..?
బ్యూటీ బడ్జెట్, రిలీజ్ గురించి మాట్లాడుతూ.. బ్యూటీ సినిమాని మొదట వేరే హీరోయిన్‌తో కొంత భాగం షూటింగ్ చేశాం. ఓ వారం రోజులు షూట్ చేసాము. ముందు రైటర్ ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. ఆ హీరోయిన్ సినిమాలో పాత్రకు అంతగా సెట్ అవ్వడం లేదు అని నీలఖిని తీసుకున్నాం. తర్వాత డైరెక్టర్ సాయి వర్ధన్ వచ్చాడు. సినిమా ఆరంభంలో చేసిన షూటింగ్ అంతా వృథా అయింది. దాని వల్ల బడ్జెట్ కాస్త పెరిగింది. కానీ బ్యూటీ కథను విన్న వెంటనే మారుతి గారికి చెప్పాను. జీ స్టూడియో, మారుతి గారి సహకారం వల్ల మా సినిమా పూర్తి చేసి ప్రతీ ఒక్కరికీ రీచ్ చేసాము. మా సినిమాని దాదాపు 150 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం. మౌత్ టాక్ తరువాత మళ్లీ థియేటర్లను పెంచుతాం అని అన్నారు.
అలాగే.. సినీ పరిశ్రమలో ఒకటి లేదా రెండు శాతమే సక్సెస్ ఉంటుంది. ఒక మూవీ తీసి హిట్టు కొట్టేస్తా అంటే ఇక్కడ కుదరదు. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా సినిమాలు నిర్మిస్తూనే ఉండాలనే ఉద్దేశం నాది. మంచి కథలు, అన్ని రకాల జానర్లలో డిఫరెంట్ సినిమాలు నిర్మిస్తాను అని తెలిపారు విజయ్ పాల్ రెడ్డి.
Also See : Priyanka Chopra : నిక్ జోనస్ బర్త్ డే.. భర్తతో క్యూట్ ఫొటోలు షేర్ చేసిన మహేష్ బాబు హీరోయిన్..