Prakash Raj : నీ వల్ల కోటి రూపాయల నష్టం.. ప్రకాష్ రాజ్ పై నిర్మాత ఫైర్..

తాజాగా ప్రకాష్ రాజ్ తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ తో ఓ వేదికపై కూర్చున్న ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు.

Producer Vinod Kumar Fires On Prakash Raj Tweet goes Viral

Prakash Raj : ప్రకాష్ రాజ్ సినిమాల్లో ఎంత మెప్పించినా బయట మాత్రం వివాదాల్లోనే ఉంటాడు. ముఖ్యంగా బీజేపీకి, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ట్వీట్స్ వేస్తూ వైరల్ అవుతూ ఉంటాడు. ఇటీవల పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడుతుండటంతో ప్రకాష్ రాజ్ పవన్ ని విమర్శిస్తూ వరుస ట్వీట్స్ వేసాడు. దీంతో పవన్ ఫ్యాన్స్, జనసైనికులు ప్రకాష్ రాజ్ ని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.

తాజాగా ప్రకాష్ రాజ్ తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ తో ఓ వేదికపై కూర్చున్న ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు. ఆ ఫొటోలో సీఎం స్టాలిన్ తో పాటు మరో మంత్రి ఉన్నారు. ఈ ఫోటో షేర్ చేసి విత్ డిప్యూటీ సీఎం అని పెట్టాడు. తాజాగా పవన్ కళ్యాణ్ తిరుపతి సభలో ఉదయనిధి స్టాలిన్ పై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రకాష్ రాజ్ ఈ ఫోటో పెట్టాడు.

Also Read : Bigg Boss 8 : బిగ్ బాస్ ఆదివారం ప్రోమో వచ్చేసింది.. హౌస్‌లోకి ఇంతమంది సెలబ్రిటీలు.. వైల్డ్ కార్డులు ఎవరెవరంటే..?

అయితే ఈ ఫోటోకి ప్రకాష్ రాజ్ కి ఊహించని ట్వీట్ ఎదురైంది. ఎనిమి, మార్క్ యాంటోని.. లాంటి పలు సినిమాలు నిర్మించిన నిర్మాత వినోద్ కుమార్ ప్రకాష్ రాజ్ ట్వీట్ కి రిప్లై ఇస్తూ.. వాళ్లంతా ఎన్నికల్లో గెలిచారు. నువ్వు డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయావు. నీకు వాళ్లకు అదే తేడా. నీ వల్ల నాకు షూటింగ్ క్యాన్సిల్ అయి కోటి రూపాయల నష్టం వాటిల్లింది. చెప్పకుండా కారవాన్ నుంచి పారిపోయావు. కాల్ చేస్తానని చెప్పారు కానీ చేయలేదు అని రిప్లై ఇస్తూ ప్రకాష్ రాజ్ స్టైల్ లోనే #justasking అని పెట్టడం గమనార్హం. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది. పవన్ ఫ్యాన్స్, జనసైనికులు కూడా ఈ ట్వీట్ ని వైరల్ చేస్తున్నారు.

ప్రకాష్ రాజ్ కు వివాదాలు కొత్తేమి కాదు గతంలో తమిళ్, తెలుగు సినీ పరిశ్రమలలో అనేక వివాదాల్లో నిలిచాడు. టాలీవుడ్ గతంలో కొన్నాళ్ల పాటు ప్రకాష్ రాజ్ ని బహిష్కరించింది కూడా.