Pushpa 2 Trailer : అల్లు అర్జున్ పుష్ప 2 ట్రైలర్ అప్డేట్.. ఎప్పుడంటే..

ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ గురించి, పుష్ప 2 సినిమా గురించి అనేక ఆసక్తికర విషయాలు, అప్డేట్స్ తెలిపారు.

Producers gives Allu Arjun Pushpa 2 Movie Trailer Update

Pushpa 2 Trailer : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కాబోతుంది. తాజాగా నేడు ఈ సినిమాకు సంబంధించి నిర్మాతలు ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు. ఈ ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ గురించి, పుష్ప 2 సినిమా గురించి అనేక ఆసక్తికర విషయాలు, అప్డేట్స్ తెలిపారు.

ప్రెస్ మీట్ లో.. పుష్ప 2 సినిమా రెండు పాటలు షూటింగ్ ఉందని, నవంబర్ 4 నుంచి షూట్ ఉంటుందని తెలిపారు. అలాగే ట్రైలర్ ని నవంబర్ లో రిలీజ్ చేస్తామని, రెండు పాటలు కూడా లిరికల్ సాంగ్స్ ని నవంబర్ లోనే రిలీజ్ చేస్తామని తెలిపారు మూవీ యూనిట్. దీపావళికి మాత్రం ఇంకా ఏమి అప్డేట్ అనుకోలేదని తెలిపారు నిర్మాతలు.

Also Read : Jani Master – Allu Arjun : జానీ మాస్టర్ పుష్ప 2కి చెయ్యట్లేదు.. మాస్టర్ ని మార్చేశాం..

దీంతో బన్నీ ఫ్యాన్స్ నవంబర్ లో రాబోతున్న ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటికే వచ్చిన సాంగ్స్ అదిరిపోగా రాబోయే సాంగ్స్ ఎలా ఉండనున్నాయి అని చర్చిస్తున్నారు. మొత్తానికి నవంబర్ నుంచి బన్నీ ఫ్యాన్స్ కి పండగే అని తెలుస్తుంది.