Producers Council : ఫిలింఛాంబర్ లో ధర్నా చేస్తున్న నిర్మాతలు..
సాధారణంగా ప్రతి రెండేళ్ళకి ఒకసారి నిర్మాతల మండలి ఎన్నికలు జరగాలి, నూతన కార్యవర్గం ఏర్పడాలి. అయితే కరోనా వల్ల గత రెండేళ్లుగా ఈ ఎన్నికలు జరగలేదు. నాలుగేళ్లుగా ఒకే కార్యవర్గం ఉంది. దీంతో కొంతమంది నిర్మాతలు.............

Producers protest at film chamber for Producer Council elections
Producers Council : తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ఇటీవల వరుసగా వివాదాల్లో నిలుస్తుంది. మొన్నటి వరకు పండక్కి సినిమాల రిలీజ్ విషయంలో నిర్మాతల మండలి చర్చల్లో నిలిస్తే ఇప్పుడు నిర్మాతల మండలి ఎన్నికలు అంటూ వార్తల్లో నిలుస్తుంది.
సాధారణంగా ప్రతి రెండేళ్ళకి ఒకసారి నిర్మాతల మండలి ఎన్నికలు జరగాలి, నూతన కార్యవర్గం ఏర్పడాలి. అయితే కరోనా వల్ల గత రెండేళ్లుగా ఈ ఎన్నికలు జరగలేదు. నాలుగేళ్లుగా ఒకే కార్యవర్గం ఉంది. దీంతో కొంతమంది నిర్మాతలు నిర్మాతల మండలి ఎన్నికలు జరపాలని, సినిమాను ప్రదర్శించే క్యూబ్, యూఎఫ్‌వో వంటి డిజిటల్ ప్రొవైడర్స్ ధరలను తగ్గించాలని కోరుతూ ఫిలిం ఛాంబర్ ప్రాంగణంలో దీక్షకు దిగారు.
Vishal : చాలా బాధగా ఉంది.. ఉదయనిధి మంత్రిగా ఆ పనులు చేయాలి.. విశాల్ వ్యాఖ్యలు..
ఇప్పుడున్న కౌన్సిల్ శైలిని వ్యతిరేకిస్తూ అర్జెంట్ గా ఎన్నికలు జరపాలని, నాలుగేళ్లు అయినా ఎన్నికల మాట ఎత్తట్లేదని వ్యాఖ్యలు చేస్తూ రామకృష గౌడ్, మోహన్, గురురాజ్.. పలువురు చిన్న నిర్మాతలు ఫిలిం ఛాంబర్ వద్ద దీక్ష చేస్తున్నారు. అయితే దీనిపై నిర్మాతల మండలి కార్యవర్గం స్పందిస్తూ కరోనా వల్ల ఈ రెండేళ్లు కుదరలేదు, ఆల్రెడీ ఎన్నికల ప్రక్రియ మొదలైంది, త్వరలోనే దాని గురించి వివరాలు వెల్లడిస్తాం అని తెలిపారు.