Project K : ప్రభాస్ ఫస్ట్ లుక్‌ని డిలీట్ చేసిన నిర్మాతలు.. మూవీ పై హాలీవుడ్ సంస్థ ట్వీట్ వైరల్..

ప్రాజెక్ట్ K నుంచి రిలీజ్ అయినా ప్రభాస్ ఫస్ట్ లుక్ పై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా చిత్ర యూనిట్ ఆ పోస్ట్ డిలీట్ చేసింది. ఇది ఇలా ఉంటే, ప్రముఖ హాలీవుడ్ సంస్థ..

Project K Prabhas First look deleted from social media and Variance Films tweet

Project K : వైజయంతి మూవీస్ పతాకం పై దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో ప్రభాస్ (Prabhas) హీరోగా తెరకెక్కుతున్న సినిమా ప్రాజెక్ట్ K. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. సూపర్ హీరో కాన్సెప్ట్ కి ఇండియన్ మైథాలజీ టచ్ ఇస్తూ ఈ మూవీని తెరకెక్కుస్తున్నారు. కలియుగం చివరిలో ఈ సినిమా స్టోరీ మొదలు కాబోతుంది. ఇక ఈ మూవీలో లోకనాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) విలన్ పాత్ర చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక రెండు రోజులు నుంచి ఈ మూవీ అప్డేట్స్ వస్తూ ఉన్నాయి.

Kamal Hasaan : హాలీవుడ్‌లో లోకనాయకుడు.. కామిక్ కాన్‌కి చేరుకున్న కమల్ హాసన్.. పిక్స్ వైరల్!

ఈ క్రమంలోనే నిన్న జులై 19న ప్రభాస్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఆ లుక్ లో ప్రభాస్ లాంగ్ హెయిర్ తో జటాజూటధారిగా కనిపిస్తూనే, సూపర్ హీరో సూట్ ధరించి మోడరన్ లుక్ లో ఉన్నాడు. అయితే ఈ లుక్ కొత్తగా ఉన్నపటికీ ఫోటోగ్రఫీ మాత్రం చాలా చెత్తగా ఉంది. ఐరన్ మ్యాన్ సూట్ కి ప్రభాస్ తల తీసుకొచ్చి అతికించినట్లు ఉంది. దీంతో సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ ని ఎదురుకుంది. అయితే నేడు చిత్ర నిర్మాతలు ఆ ఫస్ట్ లుక్ ని కొంచెం ఎడిట్ చేసి మళ్ళీ రిలీజ్ చేశారు.

Project K Comic Version : లీకైన ప్రాజెక్ట్ K కామిక్ వర్షన్.. రాక్షసుడి నుంచి ప్రజల్ని కాపాడటానికి వచ్చే దేవుడు..

ఈ క్రమంలో నిన్న రిలీజ్ చేసిన లుక్ ని తమ అకౌంట్స్ నుంచి డిలీట్ చేసేశారు. ఇది ఇలా ఉంటే, రేపు జులై 21న ఈ మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ గ్లింప్స్ ని అమెరికా కాలిఫోర్నియాలోని San Diegoలో నిర్వహించే ప్రతిష్టాత్మక ఈవెంట్ కామిక్ కాన్ లో రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ అండ్ కమల్ తో కలిసి చిత్ర నిర్మాతలు ఆ ఈవెంట్ లో సందడి చేస్తున్నారు.

Prabhas Grand Entry : హాలీవుడ్ కామిక్ కాన్ ఈవెంట్లో ప్రభాస్ గ్రాండ్ ఎంట్రీ.. ప్రభాస్ ఫోటోలు చూశారా??

ఇక ఈ గ్లింప్స్ రిలీజ్ పై ప్రముఖ హాలీవుడ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ వేరియెన్స్ ఫిల్మ్స్ (Variance Films) ట్వీట్ చేసింది. “రేపు ఉదయం మెగా బడ్జెట్ తెలుగు సైన్స్ ఫిక్షన్ మూవీ ప్రాజెక్ట్ K కామిక్ కాన్ లోని ప్రతిష్టాత్మకమైన హాల్ H లో ప్రెజెంటేషన్ ఇవ్వబోతుంది. ఇది చాలా పెద్ద విషయం. ప్రాజెక్ట్ K అంటే ఏంటో తెలుసుకోవడానికి ఎదురు చూస్తున్నాము” ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది.