Puneet Superstar
Bigg Boss OTT : బిగ్‌బాస్ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హిందీలో బిగ్‌బాస్ ఓటీటీ 2(Bigg Boss OTT 2 ) సీజన్ జూన్ 17న శనివారం ఘనంగా ప్రారంభమైంది. ఈ రియాలిటీ షోకి బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్(Salman Khan) హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. జియో సినిమా(JioCinema)లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే.. సీజన్ ప్రారంభమైన 24 గంటల్లోనే ఓ కంటెస్టెంట్ ను ఎలిమినేట్ చేశారు. గతంలో ఎన్నడూ ఈ విధంగా చేయలేదు. దీంతో ప్రస్తుతం అందరి దృష్టి ఈ షోపై పడింది.
పునీత్ సూపర్ స్టార్ సోషల్ మీడియాలో బాగా పాపులర్ కావడంతో బిగ్‌బాస్ ఓటీటీ 2లో పాల్గొనే అవకాశం వచ్చింది. 12వ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టాడు. మంచి ఆటతీరుతో అతడు టైటిల్ గెలుస్తాడని పలువురు ఆశించారు. అయితే.. షో ప్రారంభమై 24 గంటలు కూడా గడవకుండానే ఆయన్ను ఎలిమినేట్ చేశారు. హౌస్‌లో ఆయన ప్రవర్తన సరిగ్గా లేకపోవడమే అందుకు కారణం.
Anasuya : ‘నాకు కుటుంబం ఉంది.. ప్లీజ్..’ అంటూ అనసూయ వరుస ట్వీట్లు.. ఏమైందబ్బా..?
Adipurush Controversy : ఆదిపురుష్ చిత్రం ఆపేయాలంటూ రచ్చ.. ప్రేక్షకులను బయటకు వెళ్లిపోమని..
బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నంతసేపు ముఖానికి టూత్ పేస్ట్ పూసుకునే కనిపించాడు. అలా ఉండొద్దు అంటూ తోటి కంటెస్టెంట్లు చెప్పగా వారితో అనుచితంగా ప్రవర్తించాడు. అంతేకాకుండా హ్యాండ్ వాష్‌ను నెత్తిమీద పోసుకోవడం వంటివి చేశాడు. బిగ్‌బాస్ పదే పదే హెచ్చరించినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో అతడికి బయటికి పంపించేశారు. దీంతో చాలా తక్కువ సమయంలో షో నుంచి ఎలిమినేట్ అయిన తొలి కంటెస్టెంట్‌గా ఆయన చరిత్ర సృష్టించాడు.
Honey Rose : అక్కడ ముద్దు పెట్టేందుకు చాలా పెద్ద రిస్క్ చేసిన హానీ రోజ్