Puneeth Rajkumar : పునీత్ మరణంతో మరో అభిమాని మృతి

పునీత్ ఇక మళ్ళీ రాడని అందరికి తెలుసు. కానీ కొంతమంది అభిమానులు ఈ విషయాన్ని తట్టుకోలేక ప్రాణాలు విడుస్తున్నారు. పునీత్ మరణ వార్తతో కొంతమంది గుండెపోటుతో మరణించగా, మరి కొంతమంది తమ

Puneeth Rajkumar : పునీత్ మరణంతో మరో అభిమాని మృతి

Puneeth

Updated On : November 4, 2021 / 6:56 AM IST

Puneeth Rajkumar :  కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణించి 5 రోజులు అవుతున్నా కన్నడ ప్రజలు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కుటుంబ సభ్యులు, అభిమానులు ఇంకా శోకసంద్రంలోనే ఉన్నారు. నిన్ననే కుటుంబ సభ్యులు ఆయన సమాధి వద్ద పూజలు నిర్వహించారు. నిన్నటి నుంచి ఆయన సమాధిని అభిమానులు, ప్రజల సందర్శనార్థం అనుమతి ఇచ్చారు. సెలెబ్రిటీలు ఒక్కొక్కరిగా బెంగుళూరు వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించి ఆయన సమాధికి నివాళులు అర్పిస్తున్నారు.

Aliya Bhat : జీవితాంతం తండ్రి సంపాదించిన డబ్బును రెండేళ్లలో సంపాదించిన స్టార్ హీరోయిన్

పునీత్ ఇక మళ్ళీ రాడని అందరికి తెలుసు. కానీ కొంతమంది అభిమానులు ఈ విషయాన్ని తట్టుకోలేక ప్రాణాలు విడుస్తున్నారు. పునీత్ మరణ వార్తతో కొంతమంది గుండెపోటుతో మరణించగా, మరి కొంతమంది తమ అభిమాన హీరో లేడని ఆత్మహత్యకి పాల్పడ్డారు. ఇప్పటికే కర్ణాటకలో పునీత్ మరణం తట్టుకోలేక 8 మంది అభిమానులు మరణించారు. పునీత్ కేవలం సినిమాలతోనే కాక ఎన్నో సేవ కార్యక్రమాల్లో కర్ణాటక ప్రజల గుండెల్లో స్థానం సంపాదించాడు. దీంతో పునీత్ మీద అభిమానం ఆకాశాన్నంటింది. తాజాగా మరో పునీత్ అభిమాని మరణించారు. పునీత్ మరణించాడని తెలుసుకున్న అభిమాని ఆ తర్వాతి రోజే ఆత్మహత్యకి పాల్పడ్డాడు. వెంటనే హాస్పిటల్ కి తరలించి చికిత్స అందించారు. కానీ మూడు రోజులుగా చికిత్స పొందుతూ ప్రాణాలతో పోరాడి నిన్న రాత్రి మరణించారు. ఈ విషయం తెలిసి అప్పు నువ్వు లేని లోకంలో మీ అభిమానులు కూడా ఉండలేము అంటూ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక పునీత్ సమాధి వద్ద ప్రజలు బారులు తీరి ఆయనకి నివాళులు అర్పిస్తున్నారు.