Puneeth Rajkumar : నెలరోజుల పాటు ఫ్రీగా పునీత్ రాజ్ కుమార్ సినిమాలు..
పునీత్ రాజ్ కుమార్‌కి ఘన నివాళి.. ఉచితంగా సినిమాలు స్ట్రీమింగ్..

Puneeth Rajkumar
Puneeth Rajkumar: కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ నట వారసుడు, కరునాడ చక్రవర్తి శివ రాజ్ కుమార్ సోదరుడు.. పవర్‌స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. కన్నడ ప్రజలు, కుటుంబసభ్యులు, అభిమానులు ఇంకా ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
నటుడిగానే కాకుండా ఎన్నో సామాజిక కార్యక్రమాల ద్వారా ఎందరో జీవితాల్లో వెలుగులు నింపిన పునీత్ 46 ఏళ్లకే ఈ లోకాన్ని విడిచి వెళ్లడం బాధాకరం. ఇప్పటికే పలు సినీ ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులు బెంగుళూరులోని పునీత్ నివాసానికి వెళ్లి సోదరులు శివ రాజ్ కుమార్, రాఘవేంద్ర రాజ్ కుమార్, పునీత్ భార్య అశ్విని రేవంత్, కుమార్తెలు ధృతి, వందిత లను పరామర్శించారు.
Puneeth Rajkumar : నందమూరి కుటుంబంతో పునీత్ అనుబంధం..
కర్ణాటక ప్రభుత్వంతో సహా ఎందరో ఎన్నో రకాలుగా ఘననివాళులర్పించారు. ఇప్పుడు పాపులర్ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ పునీత్‌కి నివాళిగా ‘యువరత్న’ తో సహా ఐదు సినిమాలను ఫిబ్రవరి 1 నుండి 28 వరకు ఉచితంగా స్ట్రీమింగ్ చెయ్యనుంది. అలాగే పునీత్ ప్రొడక్షన్స్ పిఆర్‌కె బ్యానర్ మీద నిర్మించిన ‘వన్ కట్ టూ కట్’, ‘ఫ్యామిలీ ప్యాక్’, ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ సినిమాలను కూడా ఉచితంగా చూసే అవకాశం కల్పించింది అమెజాన్ ప్రైమ్.
Puneeth Rajkumar : ‘నువ్వు మనిషి రూపంలో ఉన్న దేవుడివయ్యా’..
View this post on Instagram