Puri gives Huge amount for Mike Tyson remuneration
మాస్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ కలయికలో వచ్చిన చిత్రం లైగర్ టైటిల్ తోనే మంచి హైప్ తెచ్చుకున్న ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో ఇటీవల విడుదలైంది. మిక్సిడ్ మార్షల్ ఆర్ట్స్ కథాంశంగా తెరకెక్కిన ఈ చిత్రం విజయ్ కి చాలా ముఖ్యమనే చెప్పాలి. ఇప్పటి వరకు ప్రేమకథలతో హిట్లు కొట్టిన విజయ్ మొదటిసారిగా ఫుల్ లెన్త్ మాస్ కథాంశంతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.
Liger Movie : లైగర్‌లో మైక్ టైసన్‌తో విజయ్ దేవరకొండకి ఫైట్ ఉందా.. పూరి జగన్నాధ్ ఏం చెప్పాడంటే..?
ఇస్మార్ట్ శంకర్ తో కమ్ బ్యాక్ ఇచ్చిన పూరి ఈ సినిమా కోసం చాలా కష్టపడడమే కాదు చాలా ఖర్చు కూడా పెట్టాడు. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ధర్మా ప్రొడక్షన్స్ తో కలిసి పూరి కనెక్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించాయి. ఈ సినిమాలో విజయ్ కి జంటగా అనన్య పాండే నటించగా రమ్యకృష్ణ విజయ్ కి తల్లిగా నటించింది. అలాగే ఈ సినిమాలో ఒక పాత్ర కోసం చిత్ర యూనిట్ ఒకప్పటి బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ ని తీసుకుంది.
Liger Locks OTT Partner: ఇవాళే రిలీజ్.. అప్పుడే ఓటీటీ ఫిక్స్..!
అసలు పూరి అంతటి లెజెండ్ ని ఏమి చెప్పి ఒప్పించాడు, అతడికి రెమ్యూనరేషన్ ఎంత ముట్టజెప్పాడు అనే దానిపై చర్చ జరుగుతుంది. దీంతో పూరి మైక్ టైసన్ కి ఏకంగా 23 కోట్లు చెల్లించాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. క్లైమాక్స్ లో కేవలం ఒక చిన్న సీన్ కోసం పూరి అంత ఖర్చు చేశాడా అని అందరూ అనుకుంటున్నారు. అయితే ఈ వార్తలో ఎంత నిజమోన్నది మాత్రం తెలియదు.