Puri Jagannadh : కంబ్యాక్ ఇవ్వబోతున్న పూరి జగన్నాధ్.. విజయ్ సేతుపతితో సినిమా అనౌన్స్.. షూటింగ్ ఎప్పుడో తెలుసా?

నేడు ఉగాది సందర్భంగా ఈ సినిమాని అధికారికంగా అనౌన్స్ చేసారు.

Puri Jagannadh Announced his Next Movie with Vijay Sethupathi

Puri Jagannadh : ఒకప్పుడు హీరోలను మాస్ హీరోలుగా మార్చిన స్టార్ డైరెక్టర్, ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ గత కొంతకాలంగా తడబడుతున్నారు. లైగర్, డబల్ ఇస్మార్ట్ రెండు సినిమాలు భారీ ఫ్లాప్ అవ్వడంతో పూరి జగన్నాధ్ తెలుగులో పలువురు హీరోలకు కథలు చూపినా ఓకే చెప్పలేదని సమాచారం. చిరంజీవితో, నాగార్జునతో, విజయ్ దేవరకొండ, గోపీచంద్ తో సినిమాలు చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ అవేవి వర్కౌట్ అవ్వలేదు.

తెలుగు హీరోలు నో చెప్తున్నారని పూరి తమిళ్ వాళ్ళ దగ్గరకు వెళ్ళాడు. ఇటీవల పూరి జగన్నాధ్ తమిళ్ స్టార్ విజయ్ సేతుపతికి కథ చెప్పాడని, విజయ్ కథ ఓకే చేసాడని వార్తలు వచ్చాయి. నేడు ఉగాది సందర్భంగా ఈ సినిమాని అధికారికంగా అనౌన్స్ చేసారు.

Also See : Sitara Ghattamaneni : సితార పాప ట్రెడిషినల్ లుక్స్.. హాఫ్ శారీలో ఉగాది నాడు..

పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాధ్, ఛార్మి నిర్మాణంలో పూరి జగన్నాధ్ దర్శకత్వంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా పాన్ ఇండియా సినిమా అనౌన్స్ చేసారు. ఈ సినిమా షూటింగ్ జూన్ నుంచి మొదలుపెట్టబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

 

Also Read : Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ షూటింగ్ ఎక్కడో చెప్పేసిన సందీప్ రెడ్డి వంగ.. వీడియో వైరల్..

ఇటీవల మహారాజాతో భారీ హిట్ కొట్టిన విజయ్ సేతుపతి హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. విజయ్ సేతుపతి సినిమా అంటే మంచి కంటెంట్ అని అందరికి నమ్మకం ఉంది. దీంతో విజయ్ సేతుపతి పూరి కథ ఓకే చేసాడంటే పూరి మళ్ళీ కంబ్యాక్ ఇస్తాడని భావిస్తున్నారు. మరి విజయ్ సేతుపతి – పూరి సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో, పూరి కంబ్యాక్ ఇస్తాడా చూడాలి.