Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ షూటింగ్ ఎక్కడో చెప్పేసిన సందీప్ రెడ్డి వంగ.. వీడియో వైరల్..
తాజాగా నేడు ఉగాది సందర్భంగా సందీప్ రెడ్డి వంగ అమెరికాలోని ఓ తెలుగు అసోసియేషన్ ఉగాది ఈవెంట్లో పాల్గొన్నాడు.

Sandeep Reddy Vanga Revealed Prabhas Spirit Movie Shooting Location
Sandeep Reddy Vanga : పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రస్తుతం చేతిలో అరడజను సినిమాలకు పైగా పెట్టుకొని బిజీగా ఉన్నాడు. పరిస్థితం రాజాసాబ్, హను రాఘవపూడి సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలు అయ్యాక ఈ సంవత్సరం చివర్లో స్పిరిట్ సినిమా మొదలు పెట్టనున్నాడు.
సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో టి సిరీస్ నిర్మాణంలో ప్రభాస్ హీరోగా స్పిరిట్ సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ పోలీసాఫీసర్ గా కనిపిస్తాడని సందీప్ గతంలోనే చెప్పాడు. సందీప్ తో సినిమా కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ లో మొదలవ్వొచ్చు అని ఇటీవల సందీప్ రెడ్డి తెలిపాడు.
Also Read : Roopa Koduvayur : మామిడికాయ కొరుకుతూ.. అందంతో.. అల్లరితో.. రూప కొడువాయూర్ ఉగాది ఫొటోలు..
తాజాగా నేడు ఉగాది సందర్భంగా సందీప్ రెడ్డి వంగ అమెరికాలోని ఓ తెలుగు అసోసియేషన్ ఉగాది ఈవెంట్లో పాల్గొన్నాడు. ఈ ఈవెంట్లో స్పిరిట్ గురించి అడగ్గా.. నేను మెక్సికోకి లొకేషన్స్ కోసం రెక్కీకి వచ్చాను. స్పిరిట్ సినిమా మెక్సికో లో షూట్ చేద్దాం అనుకుంటున్నాము. ప్రస్తుతానికి స్పిరిట్ అప్డేట్ ఇదే అని తెలిపాడు.
#Spirit shoot is going to happen in Mexico 🇲🇽 ~@imvangasandeep pic.twitter.com/aHKQOUZeMN
— చిన్ను (@Waiting4Sita) March 30, 2025
దీంతో స్పిరిట్ సినిమా మెక్సికోలో షూటింగ్ అంటే సందీప్ ఏదో భారీగానే ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. సందీప్ రెడ్డి స్పిరిట్ గురించి మాట్లాడిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.