Jana Gana Mana
గ్యాప్ లేకుండా కుమ్మేయబోతున్నారు పూరీ-విజయ్ దేవరకొండ. లైగర్ తర్వాత నెక్ట్స్ ప్రాజెక్ట్ కు కూడా లైన్ క్లియర్ చేశారు. అప్పుడో.. ఎప్పుడో కాదు ఈ ఏప్రిల్ నుంచే జనగణమన గ్రాండ్ గా సెట్స్ పై కెళ్లబోతుంది.
Puri Jagannadh : పూరి జగన్నాధ్ పాన్ వరల్డ్ సినిమా…
ఏప్రిల్ నుంచే జనగణమన పాడబోతున్నారు పూరీ జగన్నాథ్-విజయ్ దేవరకొండ. త్వరలోనే అఫీషియల్ గా ఈ ప్రాజెక్ట్ ను ప్రకటించి ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూట్ కి వెళ్లాలనేది పూరీ ప్లాన్. అయితే జనగణమన ఫస్ట్ షెడ్యూల్ షూట్ సౌత్ ఆఫ్రికాలో జరుగబోతుంది. అక్కడి లోకేషన్స్ ను సెర్చ్ చేసే పనిలో ప్రస్తుతం టీమ్ వర్క్ చేస్తోంది. దానికి సంబంధించిన ఫోటోను కూడా రీసెంట్ గా ఛార్మీ ట్వీట్ చేసింది.
Puri Jagannadh-Chiranjeevi: చిగురిస్తున్న ఆటో జానీ ఆశలు.. పూరి పట్టేశాడా?
షూటింగ్ కంప్లీట్ చేసుకున్న లైగర్.. ప్రెజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఆగస్ట్ 25న నేషనల్ వైడ్ లైగర్ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా షూటింగ్ టైమ్ లో రౌడీబాయ్ తో ఏర్పడిన మంచి ర్యాపో కారణంగా తన నెక్ట్స్ సినిమాను కూడా విజయ్ తోనే ప్లాన్ చేశారు పూరీ జగన్నాథ్. మహేశ్, పవన్ కల్యాణ్ లాంటి స్టార్స్ తో పూరీ చేయాలనుకున్న ప్రాజెక్ట్ జనగణమనను విజయ్ దేవరకొండతో చేయబోతున్నారు. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ అంటున్నారు కానీ అఫీషియల్ గా అనౌన్స్ చేయాల్సి ఉంది.