Puri Jagannadh-Chiranjeevi: చిగురిస్తున్న ఆటో జానీ ఆశలు.. పూరి పట్టేశాడా?

రౌడీ విజయ్ తో పాన్ ఇండియా సినిమా లైగర్ చేస్తున్న డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాధ్ ఇప్పుడు మాంచి జోరు మీదున్నాడు. జెట్ స్పీడ్ తో సినిమాలు చుట్టేసి పూరి ఈ సినిమా కోసం..

Puri Jagannadh-Chiranjeevi: చిగురిస్తున్న ఆటో జానీ ఆశలు.. పూరి పట్టేశాడా?

Puri Jagannadh Chiranjeevi

Puri Jagannadh-Chiranjeevi: రౌడీ విజయ్ తో పాన్ ఇండియా సినిమా లైగర్ చేస్తున్న డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాధ్ ఇప్పుడు మాంచి జోరు మీదున్నాడు. జెట్ స్పీడ్ తో సినిమాలు చుట్టేసి పూరి ఈ సినిమా కోసం చాలా టైం స్పెండ్ చేశాడు. అందుకే ఈ సినిమా పూర్తి కాకుండానే నెక్ట్స్ సినిమాలకు కూడా రెడీ అయిపోతున్నాడు పూరీ. ఇందులో భాగంగానే మ‌రోసారి చిరంజీవితో సినిమా తెరమీదకి వచ్చింది. అప్పుడెప్పుడో చిరుతో పూరి సినిమాకి సన్నాహాలు జరిగాయి. నాలుగు సార్లు ఈ అవకాశం రాగా ఒకసారి టైటిల్ కూడా ప్రకటించారు.

Nandamuri Mokshanga: మోక్షు ఎంట్రీ ఎప్పుడు..? తెరపైకి కొత్త ప్రచారం!

కానీ.. ఏమైందో ఏమో కానీ ఈ సినిమాకి అప్పుడే బ్రేకులు పడి టైటిల్ దశలోనే ఆగిపోయింది. అయితే.. పూరి మాత్రం పట్టువిడవని విక్రమార్కుడిలా ప్రయత్నాలు మాత్రం ఆపడం లేదు. ఇదే విషయాన్ని పలుమార్లు చెప్పిన పూరి ఏదోకరోజు చిరుతో సినిమా చేస్తానని ధీమాగా చెప్తుండేవాడు. కాగా.. ఈ మధ్యనే దర్శకుడు బాబీతో చిరంజీవి మరో సినిమా మొదలైంది. పక్కా మాస్ ఎలిమినేట్స్ తో తెరకెక్కనున్న ఈ సినిమాకి ఈ మధ్యనే క్లాప్ కూడా కొట్టగా ఈ వేడుకను కూడా భారీగానే నిర్వహించారు.

Manike Mage Hithe: వైరల్.. ‘మానికే మాగే’ పాటను తునాతునకలు చేసి పాడేశాడు!

చిరు 154 సినిమా ఓపెనింగ్ వేడుకలో పూరి జగన్నాధ్ స్పెషల్ అట్రాక్షన్ గా కనిపించడం ఇప్పుడు మరోసారి చిరు-పూరి సినిమా అంశం హాట్ టాపిక్ గా మారింది. ఒకప్పుడు కథ దశలో ఆగిన ఆటో జానీ సినిమాని ఇప్పుడు మళ్ళీ తెరపైకి తెస్తారా అనే చర్చ మొదలైంది. అప్పుడు చిరు కథ విషయంలో వ్యక్తం చేసిన అనుమానాలతో మార్పులు చేసిన పూరి ఇప్పుడు మళ్ళీ చిరుతో సినిమాకి సిద్దమైనట్లుగా అభిమానులలో వినిపిస్తున్న మాట. అయితే, చిరు చేతిలో ఇప్పటికే చేయాల్సినవి మూడు సినిమాలున్నాయి. మరి ఈ సినిమా గురించి పూర్తి వివరాలు తెలియాలంటే మాత్రం కొద్దికాలం ఆగాల్సిందే.