Nandamuri Mokshanga: మోక్షు ఎంట్రీ ఎప్పుడు..? తెరపైకి కొత్త ప్రచారం!

సినీ ఇండస్ట్రీలో స్టార్స్ ఒక తరం హవా ముగిసేలోపే మరో తరాన్ని తమ వారసులుగా అభిమానులకు పరిచయం చేస్తుంటారు. అందునా బడా ఫ్యామిలీల నుండి వచ్చే వారసులపై మరింత క్రేజ్ కూడా ఉండడం సహజం..

Nandamuri Mokshanga: మోక్షు ఎంట్రీ ఎప్పుడు..? తెరపైకి కొత్త ప్రచారం!

Nandamuri Mokshanga

Nandamuri Mokshanga: సినీ ఇండస్ట్రీలో స్టార్స్ ఒక తరం హవా ముగిసేలోపే మరో తరాన్ని తమ వారసులుగా అభిమానులకు పరిచయం చేస్తుంటారు. అందునా బడా ఫ్యామిలీల నుండి వచ్చే వారసులపై మరింత క్రేజ్ కూడా ఉండడం సహజం కావడంతో వీరికి రావడమే అభిమానులు బ్రహ్మరధం పట్టేస్తుంటారు. ఇప్పటికే మెగా, నందమూరి, అక్కినేని, దగ్గుబాటి లాంటి బడా ఫ్యామిలీస్ నుంచి ఎందరో నటీనటులు కెమెరా ముందుకొచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

Manike Mage Hithe: వైరల్.. ‘మానికే మాగే’ పాటను తునాతునకలు చేసి పాడేశాడు!

నందమూరి కుటుంబం నుండి మూడవ తరం హీరోగా జూనియర్ ఎన్టీఆర్ హవా కొనసాగిస్తుండగా అన్న కళ్యాణ్ రామ్ కూడా గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. అయితే.. మాస్ కా బాప్ అనేలా భారీ అభిమానులను సొంతం చేసుకున్న బాలయ్య వారసుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఇప్పుడా అన్నది చాలా కాలంగా సస్పెన్స్ గానే మిగిలిపోతూ ఉంది. అదిగో పులి ఇదిగో మేక అన్నట్లు మోక్ష ఎంట్రీకి అంతా సిద్ధం ఇక క్లాప్ కొట్టడమే బ్యాలెన్స్ అని ముమ్మర ప్రచారం జరగడం.. మళ్ళీ సైలెంట్ కావడం ఏళ్లకు ఏళ్లుగా జరుగుతూనే వస్తుంది.

Ketika Sharma: క్యూ కడుతున్న ఆఫర్లు.. ‘టాక్‌ ఆఫ్‌ ది టాలీవుడ్‌’గా కేతికా!

ఎన్నో ఏళ్లుగా మోక్ష ఎంట్రీ ఉంటుందని అభిమానులు ఆశగా ఎదురుచూస్తుంటే.. మోక్షకి వయసు పెరిగిపోతూ ఉంది. మోక్షజ్ఞకి ఇప్పుడు 27 సంవత్సరాల వయసు నిండింది. ఇదేం తక్కువ వయసు కాదు. మోక్షజ్ఞ వయసుకి అన్న జూనియర్ ఎన్టీఆర్ సీనియర్ హీరోలకు సవాల్ విసిరే సినిమాలు చేశాడు. అదే సమయంలో అన్న కళ్యాణ్ రామ్ ఆలస్యంగా ఇండస్ట్రీకి రావడంతో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. దీంతో మోక్షజ్ఞ ఎంట్రీ ఆలస్యం కావడం అభిమానులలో ఆందోళన కలిగిస్తుంది.

BiggBoss 5 : బిగ్ బాస్ విశ్వకి 9 వారాలకి భారీ రెమ్యునరేషన్

ఆ మధ్య మోక్ష ఎంట్రీ అనిల్ రావిపూడితో ఉండనుందని ప్రచారం జరగగా.. ఈ మధ్య ఇది దర్శకుడు క్రిష్ మీదకి మళ్లింది. మోక్ష కోసం తండ్రి బాలయ్య ఇప్పటికే స్వయంగా కథను సిద్ధం చేయగా.. స్వయంగా ఆయన పర్యవేక్షణలోనే క్రిష్ దీన్ని తెరకెక్కించే ప్లాన్ సిద్ధం చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఇది ఆదిత్య 369 సినిమాకి సీక్వెల్ కాగా.. పూర్తిస్థాయి సాంకేతిక హంగులతో సైన్స్ ఫిక్షన్ కథగా మలచనున్నారని చెప్తున్నారు. అయితే.. ఈ సినిమా ప్రకటన వచ్చి.. సినిమా మొదలైతే తప్ప అభిమానులకు ఆందోళన తగ్గేలా లేదు.