Poorna : బాలయ్యకి సాష్టాంగ నమస్కారం చేసిన పూర్ణ

పూర్ణ మాట్లాడుతూ బాలకృష్ణ గారి గురించి చెప్పేందుకు మాటలు చాలడం లేదు. మీలాంటి వారితో పని చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. మీ నుంచి ఎంతో నేర్చుకున్నాను. బాలయ్య బాబుకు ఎవ్వరూ....

Poorna : బాలయ్యకి సాష్టాంగ నమస్కారం చేసిన పూర్ణ

Balayyaporna

Updated On : December 10, 2021 / 12:40 PM IST

Poorna :  గతంలో సీమ టపాకాయ్, అవును, లడ్డుబాబు, అవును 2 సినిమాలలో హీరోయిన్ గా నటించి మెప్పించిన పూర్ణ తర్వాత హీరోయిన్ గా ఛాన్సులు తగ్గడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తుంది. ఢీ షోలో కూడా జడ్జిగా చేస్తూ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తుంది. అపుడప్పుడు చిన్న సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటిస్తుంది. ఇటీవల బాలకృష్ణ నుంచి వచ్చిన సూపర్ హిట్ సినిమా ‘అఖండ’లో కూడా పూర్ణ నటించింది.

Bigg Boss Lobo : బిగ్‌బాస్‌ నుంచి బయటకు రాగానే చిరంజీవి సినిమాలో ఛాన్స్ కొట్టేసిన లోబో

‘అఖండ’ సినిమా ఘన విజయం సాధించి భారీ కలెక్షన్స్ సాధిస్తుంది. నిన్న వైజాగ్ లో ఈ సినిమా విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేదికపై సినిమాలో నటించిన ప్రముఖులంతా మాట్లాడారు. పూర్ణ కూడా మాట్లాడుతూ బాలయ్యకు స్టేజిపైనే సాష్టాంగ నమస్కారం పెట్టడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

Shannu – Siri : సిరి-షణ్నులపై ఫైర్ అయిన మాధవీలత..

పూర్ణ మాట్లాడుతూ… నా 16 ఏళ్ల కెరీర్ లో ఇంతటి సక్సెస్ ఫుల్ సినిమా గురించి వేదికపై మాట్లాడడం ఇదే తొలిసారి. మాట్లాడడానికి మాటలు రావట్లేదు. శ్రీకాంత్ గారు నన్ను భయపెట్టినా కూడా మీ అందం ముందు ఆ భయం తెలియలేదు అని వ్యాఖ్యానించింది.

Bigg Boss 5 : స్టెప్పులతో దద్దరిల్లిన బిగ్‌బాస్‌ హౌస్

ఇక బాలయ్య గురించి మాట్లాడుతూ.. బాలకృష్ణ గారి గురించి చెప్పేందుకు మాటలు చాలడం లేదు. మీలాంటి వారితో పని చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. మీ నుంచి ఎంతో నేర్చుకున్నాను. బాలయ్య బాబుకు ఎవ్వరూ దిష్టి పెట్టకూడదు అని చెప్పి ఇంత కంటే ఎక్కువ చెప్పలేను అంటూ స్టేజి మీద నుంచి బాలయ్య బాబుని చూసి సాష్టాంగ న‌మ‌స్కారం చేసింది. బాలయ్య అప్పుడు కింద కూర్చున్నారు. స్టేజిపై ఉండి బాలయ్యకి పూర్ణ సాష్టాంగ నమస్కారం చేయడంతో అభిమానులు అరుపులు, విజిల్స్ తో సభా ప్రాంగణాన్ని హైలెట్ చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.