Pushpa 2 : ‘పుష్ప 2’ ఫ‌స్ట్‌ కాపీ రెడీ అయింది.. సుకుమార్ ఫోటోలు వైర‌ల్‌..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తున్న మూవీ పుష్ప 2.

Pushpa 2 : ‘పుష్ప 2’ ఫ‌స్ట్‌ కాపీ రెడీ అయింది.. సుకుమార్ ఫోటోలు వైర‌ల్‌..

Pushpa 2 First copy ready Sukumar photos viral

Updated On : November 28, 2024 / 12:31 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తున్న మూవీ పుష్ప 2. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ మూవీలో ర‌ష్మిక క‌థానాయిక‌గా న‌టిస్తోంది. డిసెంబ‌ర్ 5న ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ బాష‌ల్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది.

ఈ చిత్ర షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉందంటూ వార్త‌లు రాగా.. వాటి అన్నింటికి అల్లు అర్జున్ క్లారిటీ ఇచ్చేశారు. న‌వంబ‌ర్ 26న ఈ చిత్ర షూటింగ్ పూర్తి అయిన‌ట్లుగా పోస్ట్ చేశారు. మ‌రోవైపు చిత్ర ప్ర‌మోష‌న్స్ కార్య‌క్ర‌మాల‌ను త‌న భుజాల‌పై వేసుకున్న బ‌న్నీ దేశంలోని ప‌లు ప్రాంతాల్లో ఈ చిత్రాన్ని ప్ర‌మోట్ చేసే ప‌నిలో బిజీగా ఉన్నారు. ఇంకోవైపు సుకుమార్ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల్లో బిజీగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి.

Ajith Kumar : ఆ దేశంలో అజిత్ కార్ రేసింగ్.. ఫొటోస్ చూసారా..

తాజాగా చిత్ర బృందం సూప‌ర్ అప్‌ఢేట్ ఇచ్చింది. ఈ చిత్ర ఫ‌స్ట్ కాపీ రెడీ అయిన‌ట్లు తెలిపింది. ఎడిటింగ్ రూమ్‌లో సుకుమార్ ఉన్న ఫోటోలు పోస్ట్ చేస్తూ అద్భుత అనుభ‌వాన్ని పంచేందుకు అతిపెద్ద భారతీయ చ‌ల‌న చిత్రం సిద్ధంగా ఉన్న‌ట్లు ట్వీట్ చేసింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు వైర‌ల్‌గా మారింది.

Naveen Chandra : వామ్మో అస్థిపంజరంతో నవీన్ చంద్ర ఆటలు.. వీడియో చూసారా..

అంతా పూర్తి అయింద‌ని, ఇక విడుద‌లే త‌రువాయి అని పేర్కొన‌డంతో..  ఈ చిత్రాన్ని బిగ్ స్క్రీన్ పై ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.