సినిమా టికెట్ రేట్ల పెంపు ఫ్యాన్స్‌ను హడలెత్తిస్తోంది. ఫస్ట్ డే ఫస్ట్ షో..లేకపోతే బెన్ ఫిట్ షో చూద్దామనుకున్న వారు టికెట్ రేట్లు చూసి షాక్ అవుతున్నారు. సింగిల్ స్క్రీన్ టికెట్ 150, మల్టీప్లెక్స్‌లో 250వరకు ఉండే టికెట్ ఏకంగా..ట్రిబుల్ అయిపోవడంతో వామ్మో ఇవేం రేట్లు అంటూ మీమ్స్, కామెంట్స్‌తో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు ఫ్యాన్స్.
పుష్ప-2 అయిపోయాక సంక్రాంతికి గేమ్‌ఛేంజర్, డాక్ మహారాజ్ మూవీస్ వస్తున్నాయి. తమిళ్ సినిమా విదాముయార్చి భారీ స్థాయిలో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. గేమ్‌ఛేంజర్ జనవరి 10న రిలీజ్ అవుతుండగా, డాక్ మహారాజ్ జనవరి 12న, సంక్రాంతి బరిలోకి వస్తున్నాం మూవీ జనవరి 14న రిలీజ్ కాబోతోంది. మూడు పెద్ద సినిమాలు కావటంతో ప్రేక్షకులు మూడు సినిమాలు చూడాలనుకుంటారు.
కానీ పుష్ప-2 టికెట్ రేట్ల మాదిరిగానే ఈ మూడు సినిమాలకు పెంచితే థియేటర్‌కు వెళ్లి మూవీ చూడాలంటే ఆలోచించాల్సిదేనంటున్నారు. పుష్ప-2 బెనిఫిట్ షో మల్లిఫ్లెక్స్ టికెట్ రేటు 1200 దాక అవుతుంది. ఇక సంక్రాంతి సినిమాలకు కూడా ఇలానే పెంచితే, ప్రేక్షకుల జేబులకు చిల్లు పడటం ఖాయమన్న చర్చ జరుగుతోంది.
ఫ్యామిలీతో పాటు సినిమాకు వెళ్లాలనుకున్నా, ఫ్రెండ్స్‌తో వెళ్లినా అకౌంట్ ఖాళీ అవ్వటం పక్కా. గేమ్‌ఛేంజర్, డాక్ మహారాజ్ మూవీస్ టికెట్ రేట్లు అయితే ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. మరి ఇప్పుడే పుష్ప-2 కే గగ్గోలు పెడుతున్న ఫ్యాన్స్, ఆడియన్స్ సంక్రాంతి సినిమాలకు బోరుమనటం ఖాయం. ఆడియన్స్ నుంచి వస్తున్న డిమాండ్ ప్రకారం టాలీవుడ్‌తో పాటు రెండు తెలుగు రాష్రాల ప్రభుత్వాలు టికెట్ రేట్లు తగ్గిస్తాయా లేక అలానే పెంచుతాయని అనేది ఉత్కంఠగా మారింది.
Raja Saab : ప్రభాస్ ‘రాజాసాబ్’ టీజర్ అప్పుడేనా? ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగే..