Raja Saab : ప్రభాస్ ‘రాజాసాబ్’ టీజర్ అప్పుడేనా? ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగే..
ఇప్పటికే రాజాసాబ్ సినిమా నుంచి ఓ మోషన్ పోస్టర్, ఓ చిన్న గ్లింప్స్ రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తి పెంచారు.

Prabhas The Raja Saab Movie Teaser Release Update
Raja Saab : ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆల్మోస్ట్ అరడజను పైగా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు ప్రభాస్. ప్రస్తుతం రాజాసాబ్ సినిమాతో పాటు హను రాఘవపూడి సినిమా షూటింగ్స్ చేస్తున్నాడని సమాచారం. ఇటీవలే ఓ ఈవెంట్లో మాళవిక మోహనన్ రాజాసాబ్ సినిమా ఆల్మోస్ట్ షూటింగ్ అయిపొయింది. కొన్ని రోజులు మాత్రమే బ్యాలెన్స్ ఉందని తెలిపింది.
ఇప్పటికే రాజాసాబ్ సినిమా నుంచి ఓ మోషన్ పోస్టర్, ఓ చిన్న గ్లింప్స్ రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తి పెంచారు. లవ్ స్టోరీతో పాటు కామెడీ, హారర్ అంశాలతో ఈ సినిమా ఉండబోతుంది. ఏప్రిల్ 10న ఈ సినిమా రిలీజ్ చేస్తారని ప్రకటించారు. అయితే తాజా సమాచారం ప్రకారం రాజాసాబ్ టీజర్ త్వరలోనే రాబోతుందట.
Also Read : Pushpa 2 Security : హైదరాబాద్ పుష్ప 2 ఈవెంట్.. మొదటిసారి 1000 మంది పోలీసులతో భద్రత..
మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రభాస్ రాజాసాబ్ సినిమా టీజర్ క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేస్తారని టాలీవుడ్ లో వినిపిస్తుంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఈ టీజర్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే లవ్ ఫీల్ ఉన్న గ్లింప్స్, హారర్ ఫీల్ ఉన్న మోషన్ పోస్టర్ రిలీజ్ చేయడంతో టీజర్ ఎలా ఉంటుందో అని ఆలోచిస్తున్నారు. ఇక ప్రభాస్ మొదటిసారి హారర్ సినిమా చేస్తుండటం, ముసలి గెటప్ లో కూడా నటిస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.