Pushpa 2 – Traffice Advisory : పుష్ప దెబ్బకు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఆ రోడ్ బ్లాక్.. ట్రాఫిక్ డైవర్షన్ లిస్ట్..
పుష్ప వైల్డ్ ఫైర్ జాతర ట్రాఫిక్ ఆంక్షలు ఇవే..

Pushpa 2 Hyderabad Event Traffic Advisory from Police Department Here Details
Pushpa 2 – Traffice Advisory : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న రిలీజ్ అవుతుండటంతో ఇప్పటికే భారీగా పలు ఈవెంట్స్ చేసారు. ఇప్పుడు హైదరాబాద్ లో చెయ్యబోతున్నారు. పుష్ప వైల్డ్ ఫైర్ జాతర అనే పేరుతో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లోని యూసుఫ్ గూడలో ఉన్న కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియం వెనుక పోలీస్ గ్రౌండ్స్ లో రేపు డిసెంబర్ 2 సాయంత్రం 6 గంటలకు చెయ్యనున్నారు.
ఓపెన్ గ్రౌండ్ కావడం, ఈవెంట్ భారీగా నిర్వహిస్తుండటంతో ఫ్యాన్స్ చాలా మంది వచ్చే అవకాశం ఉంది. దీంతో ఆ ఏరియాలలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అటు వైపు వచ్చే వాహనాల దారులను మళ్లిస్తూ హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రెస్ నోట్ విడుదల చేసింది. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ ఆంక్షలు ఉండనున్నాయి.
Fahadh Faasil : ఆ సినిమా ఎందుకు చేశానా అని బాధపడ్డా.. పుష్ప నటుడు కామెంట్స్..
పుష్ప వైల్డ్ ఫైర్ జాతర ట్రాఫిక్ ఆంక్షలు ఇవే..
#యూసుఫ్ గూడ చెక్ పోస్ట్ నుంచి అన్నపూర్ణ స్టూడియో వైపు మోర్ సూపర్ మార్కెట్ వరకు రోడ్ ని బ్లాక్ చేయనున్నారు.
#జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి యూసుఫ్ గూడ మెట్రో వైపు వెళ్లే వాహనాలను మోర్ మార్కెట్ వద్ద నుంచి శ్రీ నగర్ కాలనీ, పంజాగుట్ట వైపు మళ్లిస్తారు.
#మైత్రివనం నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, మాదాపూర్ వైపు వెళ్లే వాహనాలను యూసుఫ్ గూడ బస్తి నుంచి RBI క్వార్ట్రర్స్ మీదుగా శ్రీనగర్ కాలనీ మీదుగా రోడ్ నెంబర్ 5 నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ కు మళ్లిస్తారు.
#మైత్రీవనం నుంచి బోరబండ వెళ్లే వాహనాలు యూసుఫ్ గూడ సవేరా ఫంక్షన్ హాల్ దగ్గర యు టర్న్ తీసుకొని కృష్ణకాంత్ పార్క్ మీదుగా కళ్యాణ్ నగర్ మీదుగా బోరబండ వైపు మళ్లించనున్నారు.
#బోరబండ నుంచి మైత్రీవనం వైపు వచ్చేవాళ్ళు యూసుఫ్ గూడ రాకుండా కళ్యాణ్ నగర్ మీద నుంచి SR నగర్ నుంచి మైత్రివనం వైపు వెళ్ళాలి.
#ఇక ఈవెంట్ కి పార్కింగ్ కి వచ్చేవాళ్ళు తమ వీలర్స్ జానకమ్మ తోటలో, కార్లు అయితే సవేరా ఫంక్షన్ హాల్, మహమ్మద్ ఫంక్షన్ హాల్ లో పెట్టాలి.
రేపు అటు వైపు నుంచి వెళ్ళేవాళ్ళు ఈ ట్రాఫిక్ ఆంక్షలు గుర్తుపెట్టుకొని ప్లానింగ్ చేసుకోండి.