Pushpa 2 : ‘పుష్ప 2’లో చిరంజీవి.. అభిమానులకు పండగే.. షూటింగ్ నుంచి ఫోటోలు లీక్..

తాజాగా పుష్ప 2 షూటింగ్ నుంచి లీక్ అయిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Pushpa 2 : ‘పుష్ప 2’లో చిరంజీవి.. అభిమానులకు పండగే.. షూటింగ్ నుంచి ఫోటోలు లీక్..

Pushpa 2 Movie Having Chiranjeevi and Indra Movie Reference Photos Leaked from Shooting

Updated On : October 18, 2023 / 7:50 AM IST

Pushpa 2 : అల్లు అర్జున్(Allu Arjun) సుకుమార్(Sukumar) కాంబినేషన్లో వచ్చిన పుష్ప సినిమా ఎంతటి భారీ విజయం సాధించిందో అందరికి తెలిసిందే. సినిమాలోని పాటలు, డైలాగ్స్ అయితే ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. ఈ సినిమాకి అల్లు అర్జున్ నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా సాధించి ఈ అవార్డు అందుకున్న మొదటి తెలుగు నటుడిగా రికార్డ్ సెట్ చేశాడు. ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాని వచ్చే సంవత్సరం ఆగస్టు 15న రిలీజ్ చేస్తామని ఆల్రెడీ చిత్రయూనిట్ ప్రకటించారు.

అయితే తాజాగా పుష్ప 2 షూటింగ్ నుంచి లీక్ అయిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సినిమా కథ 2000 సంవత్సరం, ఆ సమయంలో జరుగుతున్న కథగా పుష్పలో చూపించారు. అయితే తాజాగా లీక్ అయిన ఫొటోల్లో పుష్పరాజ్ చిరంజీవి ఫ్యాన్ అని, ఇంద్ర సినిమా రిలీజ్ సమయంలో థియేటర్ దగ్గర పుష్పరాజ్ యువసేన అని బ్యానర్లు పెట్టినట్టు, చిరంజీవి బ్యానర్లు పెట్టి పుష్పరాజ్ హంగామా చేసినట్టు తెలుస్తుంది.

Also Read : Allu Arjun : నేషనల్ అవార్డు అందుకునే ముందు నేషనల్ మీడియాతో అల్లు అర్జున్ ఏం మాట్లాడాడో తెలుసా?

దీంతో పుష్ప 2 సినిమాలో చిరంజీవి ఇంద్ర రిఫరెన్స్ వాడుతున్నట్టు తెలుస్తుంది. ఇంద్ర సినిమా సమయంలో థియేటర్స్ వద్ద హంగామా, థియేటర్లో చేసే హడావిడి సినిమాలో చూపించబోతున్నట్టు తెలుస్తుంది. దీంతో మెగా అభిమానులు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంద్ర సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. మరి ఈ సినిమాలో ఇంద్ర సీన్స్ కి అభిమానులు ఏ రేంజ్ లో థియేటర్స్ లో రచ్చ చేస్తారో చూడాలి.