Pushpa 2 Movie : మాస్ జాతర, రికార్డుల మోత.. ప్రీ రిలీజ్ బిజినెస్‌లో దూసుకుపోతున్న పుష్ప-2

పుష్ప 2 ఇండియన్ సినిమా హిస్టరీనే మార్చేయబోతోందా?

Pushpa 2 Movie : జాతర.. ఇది మాస్ జాతర.. ఫుల్ లోడ్ ఫైర్.. వైల్డ్ ఫైర్ అంటూ.. పుష్ప పుష్పరాజ్ తగ్గేదేలే అంటున్నాడు. దేశంలో ఎక్కడ చూసినా పుష్ప ఫీవరే కనిపిస్తోంది. పుష్ప ద రూల్.. దునియాను షేక్ చేస్తోంది. ఓ మారుమూల అడవుల్లో జరిగేటటువంటి టాపిక్ బేస్ గా వచ్చిన సినిమా.. దుమ్ము లేచిపోయే విధంగా రికార్డుల కలెక్ట్ చేసింది. ఇప్పుడు దాని సీక్వెల్ వేరే లెవెల్ లో ఉండబోతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన పుష్ప 2 ట్రైలర్.. మూవీపై ఓ రేంజ్ లో అంచనాలను పెంచేస్తోంది. డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ లో రికార్డులు క్రియేట్ చేస్తోంది. పుష్ప 2 ఇండియన్ సినిమా హిస్టరీనే మార్చేయబోతోందా? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కాబోతున్నాయా?

డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న పుష్ప.. విడుదలకు ముందే రికార్డులను తిరగరాస్తోంది. ఇప్పటికే ట్రైలర్ తో సరికొత్త రికార్డులను సృష్టిస్తున్న పుష్ప.. ప్రీ రిలీజ్ బిజినెస్ లో తమకు ఎవరూ సాటి లేరని సత్తా చాటుతోంది. ప్రీ సేల్ బుకింగ్స్ లో సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేసే దిశగా దూసుకెళ్తున్నాడు ఐకాన్ స్టార్.

అల్లు అర్జున్ హీరోగా వస్తున్న పుష్ప 2 క్రేజ్ రోజురోజుకి నెక్ట్స్ లెవెల్ కి చేరుకుంటోంది. ఇండియన్ టాప్ స్టార్స్ కూడా టచ్ చేయని రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. అది కూడా రిలీజ్ ముందే. ఆ లిస్టులో మన స్టార్స్ దరిదాపుల్లో లేకుండా లేరని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇదీ నా కాలె, ఇదీ నా కాలె. ఇచ్చిపడేసేది కూడా తానే అంటూ ఈసారి మునుపటిలా ఉండదు పుష్ప అంటున్నా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. పార్టీ లేదా పుష్ప అనే వాళ్లకు ఓ రేంజ్ లో దావత్ ఇవ్వబోతున్నాడట. ఫ్యాన్స్ అంచనాలకు తగ్గట్లుగా బొమ్మ దద్దరిల్లిపోనుంది. సిల్వర్ స్క్రీన్ మీద బన్నీ పెర్ఫార్మన్స్ వేరే లెవెల్ లో ఉంటుందన్న టాక్.. గట్టిగా వినిపిస్తోంది. ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ లెక్క అయితే మూవీపై ఫ్యాన్స్ అంచనాలు వేరే లెవెల్ లో ఉన్నాయి. ఫ్యాన్స్ ను పుష్ప ఎలా అలరించబోతున్నాడు. నెవర్ బిఫోర్ సినిమాగా పుష్ప 2 నిలవబోతోందా?

 

Also Read : అల్లు అర్జున్ ‘పుష్ప2’ నుంచి ‘కిస్సిక్’ సాంగ్‌.. బ‌న్నీ, శ్రీలీల డ్యాన్స్‌ అదుర్స్‌..