Pushpa 2 Producers : హాస్పిటల్ లో శ్రీ తేజను పరామర్శించిన పుష్ప నిర్మాతలు.. 50 లక్షల చెక్కు ఆ కుటుంబానికి ఇచ్చి..

తాజాగా పుష్ప 2 నిర్మాతలు మైత్రి నవీన్, రవి శంకర్ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న శ్రీ తేజను పరామర్శించారు.

Pushpa 2 Producers went to Hospital and gives Cheque to Sree Tej Family

Pushpa 2 Producers : పుష్ప 2 రిలీజ్ సమయంలో సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ బాలుడు ప్రస్తుతం కిమ్స్ లో చికిత్స పొందుతున్నాడు. తాజాగా పుష్ప 2 నిర్మాతలు మైత్రి నవీన్, రవి శంకర్ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న శ్రీ తేజను పరామర్శించారు.

Also Read : CM Revanth Reddy : బెనిఫిట్ షోస్, టికెట్ రేట్ల పై సీఎం రేవంత్ రెడ్డిని సమర్ధించిన తెలంగాణ, తెలుగు ఫిలిం ఎగ్జిబిట‌ర్స్‌..

అనంతరం నిర్మాతలు మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘటనపై చాలా బాధపడ్డాము. రేవతి గారు చనిపోవడం దురదృష్టకరం. బాబుని చూడటానికి వచ్చాము. అతను రికవరీ అవుతున్నాడు. వాళ్ళ కుటుంబానికి సహాయం ఉండాలని మా వంతు సహాయంగా ఇది అందచేస్తున్నాము అంటూ 50 లక్షల రూపాయల చెక్కును శ్రీ తేజ తండ్రికి మైత్రి మూవీ క్రియేషన్స్ నిర్మాతలు నవీన్, రవిశంకర్ అందించారు.

అనంతరం సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. సంధ్య థియేటర్లో జరిగిన ఘటన అంశాన్ని ప్రభుత్వం నిశితంగా పరిశీలించింది. ఈ విషయాన్ని రాజకీయం చేయడం, రాజకీయ నాయకులు ఈ అంశంపై మాట్లాడడం ఆపేయాలి. అల్లు అర్జున్ ఇంటిపై జేఏసీ నేతలు దాడి ఖండిస్తున్నాను. సినీ హీరో అల్లు అర్జున్ ఇంటి పై దాడి చేయడం, వ్యక్తిగతంగా దూషించడం సరికాదు. ఇళ్లపై దాడులు చేస్తే చర్యలు తప్పవు. చట్టాన్ని చేతిలోకి తీసుకునే ప్రయత్నం మానుకోవాలి. ఇలాంటి ఘటనల విషయంలో పోలీసు శాఖ వారి పని వారు చేసుకుంటారు. తెలంగాణలో సినీ పరిశ్రమను అన్ని రకాలుగా ప్రోత్సాహాన్ని అందించి ముందుకు తీసుకెళ్తాము. తెలంగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమ విషయంలో సానుకూల దృక్పథంతో ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘటనపై ప్రతినిత్యం ఆరా తీస్తున్నారు. రేవతి కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని పూడ్చలేము. బాలుడు శ్రీ తేజ త్వరగా కోలుకోవాలని ప్రతి ఒక్కరూ ప్రార్థించాలి. శ్రీ తేజ కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది అని అన్నారు.

Also Read : Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ నా కొడుకు వైద్యానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.. అభిమాని తల్లి ఆవేదన..

పుష్ప 2 రిలీజ్ సమయంలో సంధ్య థియేటర్లో సినిమా చూడటానికి అల్లు అర్జున్ వెళ్లడంతో భారీగా అభిమానులు రావడంతో అక్కడ తొక్కిసలాట జరిగి ఓ మహిళ చనిపోగా ఆమె కుమారుడు శ్రీ తేజ స్పృహతప్పి పడిపోయాడు. దీంతో ఈ ఘటన సంచలనంగా మారింది. ప్రస్తుతం ఆ బాలుడు కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.