CM Revanth Reddy : బెనిఫిట్ షోస్, టికెట్ రేట్ల పై సీఎం రేవంత్ రెడ్డిని సమర్ధించిన తెలంగాణ, తెలుగు ఫిలిం ఎగ్జిబిట‌ర్స్‌..

తాజాగా టాలీవుడ్ పెద్దల ఆలోచనలకు వ్యతిరేకంగా తెలంగాణ పిల్మ్ ఛాంబర్ ఎగ్జిబిట‌ర్స్‌ అసోసియేషన్ సభ్యులు మాట్లాడటంతో చర్చగా మారింది.

CM Revanth Reddy : బెనిఫిట్ షోస్, టికెట్ రేట్ల పై సీఎం రేవంత్ రెడ్డిని సమర్ధించిన తెలంగాణ, తెలుగు ఫిలిం ఎగ్జిబిట‌ర్స్‌..

Updated On : December 23, 2024 / 4:23 PM IST

CM Revanth Reddy : ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో సంధ్య థియేటర్ ఘటనను దృష్టిలో ఉంచుకొని ఇకపై తాను సీఎంగా ఉన్నంతవరకు బెనిఫిట్ షోలకు, టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇవ్వను అని ప్రకటించారు. దీంతో సీఎం రేవంత్ నిర్ణయంతో టాలీవుడ్ పెద్దలు తలలు పట్టుకున్నారు. పెద్ద హీరోల సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాల పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తున్నారు.

అయితే తాజాగా టాలీవుడ్ పెద్దల ఆలోచనలకు వ్యతిరేకంగా తెలంగాణ పిల్మ్ ఛాంబర్ ఎగ్జిబిట‌ర్స్‌ అసోసియేషన్ సభ్యులు మాట్లాడటంతో చర్చగా మారింది. సీఎం రేవంత్ కామెంట్స్ పై నేడు తెలంగాణ పిల్మ్ ఛాంబర్ ఎగ్జిబిట‌ర్స్‌ అసోసియేషన్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ ప్రెస్ మీట్ లో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు విజయేందర్ రెడ్డి మాట్లాడుతూ.. బెనిఫిట్ షోస్, టికెట్ రేట్ల పై సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం సింగిల్ స్క్రీన్స్ కు ఊపిరి పోసేలా ఉన్నాయి. సీఎం గారికి, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కు కృతజ్ఞతలు అని అన్నారు.

Also Read : Mohan Babu : మోహన్ బాబు అరెస్ట్ తప్పదా? మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసిన కోర్టు..

తెలుగు ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామ్ ప్రసాద్ మాట్లాడుతూ.. కొందరు నిర్మాతలు ఎక్కువ ఖర్చు పెట్టి సినిమా తీసాం అని అధిక రేట్లు పెడుతున్నారు. దీని వల్ల ప్రేక్షకులకు, థియేటర్స్ వారికి ఇబ్బంది కలుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆంధ్రాలో కూడా అమలు అవ్వాలి అని అన్నారు.

తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ కార్యదర్శి బాలగోవింద్ మాట్లాడుతూ.. ఆడియన్స్ కి టికెట్ రేటు ఎంత ఉందో కూడా తెలియక అయోమయంలో ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం స్వాగతిస్తున్నాము. రేట్లు పెరగడం వల్ల పెద్ద సినిమా చూడడానికి ఎక్కువ డబ్బులు పెడుతున్నారు. దాంతో చిన్న సినిమాకు డబ్బులు ఉండడం లేదు ఆడియన్స్ దగ్గర. సగటు ప్రేక్షకుడు థియేటర్ దగ్గరకు రావాలి. అలాగే హీరోలు థియేటర్స్ కు వెళ్ళొద్దు అని మంత్రి అనడం సముచితం కాదు అని అన్నారు.

ఇండస్ట్రీ అంతా సీఎం నిర్ణయంతో షాక్ అవుతుంటే ఇలా ఎగ్జిబిటర్స్ మాత్రం సీఎం నిర్ణయానికి మద్దతు పలకడంతో వీరి కామెంట్స్ టాలీవుడ్ లో చర్చగా మారాయి.