Pushpa 2 : జాతర సీక్వెన్స్‌లో మహిళలకు పూనిన అమ్మవారు..!
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన మూవీ పుష్ప2.

Pushpa 2 screening goddess enters into woman body Video viral
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన మూవీ పుష్ప2. రష్మిక కథానాయికగా నటించిన ఈ మూవీ డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పుష్పకి సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అల్లు అర్జున్ నట విశ్వరూపాన్ని చూసి ఆడియెన్స్ మైమరిచిపోతున్నారు. మరోసారి జాతీయ అవార్డును ఇచ్చేయొచ్చు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ మూవీలో జాతర సీక్వెన్స్‌లో అమ్మవారి గెటప్‌లో బన్నీ నటన హైలెట్. ఇక థియేటర్లలో ఈ సన్నివేశం పూనకాలు తెప్పిస్తోంది. కాగా.. థియేటర్లలో ఈ సన్నివేశం వస్తున్నప్పుడు పలువురు మహిళలకు అమ్మవారు పూనింది.
Pushpa 2 : ఆ మూడు రాష్ట్రాల్లో పుష్ప 2 సరికొత్త రికార్డు.. మొదటి తెలుగు సినిమాగా..
దీంతో పక్క సీట్లలో ఉన్న వారు మహిళలను శాంతింపజేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలను పుష్ప టీమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి వైరల్‌గా మారాయి.
అనసూయ, సునీల్, ఫహాద్ పాజిల్ కీలక పాత్రలను పోషించిన ఈ చిత్రం తొలి రోజున ప్రపంచ వ్యాప్తంగా 294 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ క్రమంలో భారతీయ సినీ చరిత్రలో తొలి రోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. ఇక హిందీలో ఈ చిత్రం తొలి రోజు రూ. 72 కోట్ల వసూళ్లను సాధించింది. ఇక ఓవర్‌సీస్‌నూ ఈ చిత్రం మంచి వసూళ్లను రాబడుతోంది.
Pushpa 2 : కుప్పంలో ‘పుష్ప2’కి భారీ షాక్.. సినిమాను నిలిపివేసిన రెవిన్యూ అధికారులు!
Gango Renuka Thalli 🙏🏻🙏🏻🔥🔥#Pushpa2TheRule pic.twitter.com/p2nH6EMTsb
— Pushpa (@PushpaMovie) December 7, 2024