Pushpa 2 : కుప్పంలో ‘పుష్ప2’కి భారీ షాక్.. సినిమాను నిలిపివేసిన రెవిన్యూ అధికారులు!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన మూవీ పుష్ప2.

Big Shock to Pushpa 2 movie in Kuppam
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన మూవీ పుష్ప2. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రష్మిక కథానాయికగా నటించిన ఈ మూవీ తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుని రికార్డ్ కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది.
అయితే.. తాజాగా ఈ చిత్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా కుప్పంలో షాక్ తగిలింది. కుప్పంలోని లక్ష్మీ, మహాలక్ష్మి థియేటర్లలో పుష్ప 2 సినిమాను రెవిన్యూ అధికారులు నిలిపివేశారు. ఈ రెండు థియేటర్లకు ఎన్ఓసీ లేని కారణంగా సినిమాను నిలిపివేశారు. దీంతో సినిమా చూడాలని ఎంతో ఆశగా థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులు ఈ ఘటనతో నిరాశగా వెనుదిరిగారు.
అనసూయ, ఫహాద్ ఫాజిల్, సునీల్ లు కీలక పాత్రలో నటించగా మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ లు నిర్మించారు. బాక్సాఫీస్ వద్ద పుష్ప2 హవా మొదలైంది. హిందీ వెర్షన్‌లో తొలి రోజు ఏకంగా 72 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది.
ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం తొలి రోజు 294 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఓవర్సీస్‌లోనూ మంచి వసూళ్లు సొంతం చేసుకొంటోంది.
Siri Hanmanth-Shrihan : ఎన్నాళ్లనుంచో రిలేషన్.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న జంట..!