ప్రమోషన్స్ మొదలు పెట్టబోతున్న పుష్ప టీం!

ఇష్యూస్‌పై బన్నీ ఎలా రియాక్ట్ అవతున్నాడన్నది మాత్రం ఆసక్తి రేపుతోంది.

Pushpa 2 Allu Arjun

పుష్ప ది రూల్.. ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. తెలుగులోనే కాదు ఇండియా వైడ్‌గా ఈ పిక్చర్‌పై భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉన్నాయి. పుష్ప ది రైజ్ సినిమా సూపర్ హిట్ కావడంతో..పార్ట్-2పై భారీ అంచనాలున్నాయ్. దానికి తగ్గట్టుగా డైరెక్టర్‌ సుకుమార్, హీరో అల్లుఅర్జున్ మరింత ఎగ్జైట్‌మెంట్‌ క్రియేట్ చేస్తున్నారు.

అయితే మూవీ యూనిట్‌ మీడియా ముందుకు రాబోతుండటం ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే మూవీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్ అయిపోయింది. డిసెంబర్ 6న విడుదలకు అంతా సిద్ధం చేస్తున్నారు. ఈ టైమ్‌లో మూవీ యూనిట్‌ ప్రెస్‌మీట్‌ పెడుతుండటం ఓ రకంగా ఆసక్తికరంగా..మరోరకంగా ఉత్కంఠగా మారింది.

ప్రెస్‌మీట్‌ అంటే ఇప్పటి నుంచే ప్రమోషన్స్ మొదలుపెట్టబోతున్నారని దీపావళికి ఒక స్పెషల్ సర్‌ప్రైజ్‌ కూడా ఉంటుందని తెలుస్తోంది. నవంబర్‌లో పుష్ప నుంచి నెక్స్ట్ సాంగ్ రిలీజ్ చేయబోతున్నారని టాక్. కేవలం రెండు సాంగ్స్ షూటింగ్ మాత్రం బాకీ ఉన్నట్లుగా తెలుస్తోంది. అందులో ఒకటి ఐటమ్ సాంగ్ కాగా ఐటమ్ సాంగ్ కోసం శ్రద్ధా కపూర్‌ని రంగంలోకి దించారు.

అయితే ప్రెస్‌మీట్‌ ఎందుకు పెడుతున్నట్లు అన్న చర్చ జరుగుతోంది. మూవీ రిలీజ్‌ వాయిదా వేస్తారా.. లేక..ప్రెస్‌మీట్‌తోనే ప్రమోషన్స్‌ స్టార్ట్‌ చేస్తారన్న డిస్కషన్ డౌట్‌ అయితే కొనసాగుతోంది. తెలుగులో ప్రెస్‌మీట్‌ పెట్టాక..తర్వాత నార్త్ మీద ఫోకస్ పెడుతారని అంటున్నారు. సినిమాని కచ్చితంగా డిసెంబరు 6న రిలీజ్ చేస్తారని 4,5 తేదీల్లో స్పెషల్ ప్రీమియర్స్‌కు ప్లాన్ కూడా చేస్తున్నారని తెలుస్తోంది.

ముఖ్యంగా నార్త్‌లో బాగా ప్రమోషన్స్
ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం పుష్ప-2 సినిమా డిసెంబర్ 6న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ప్రీరిలీజ్ బిజినెస్ దాదాపు 1060 కోట్ల వరకు జరిగిందని సినిమా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఒకవైపు షూటింగ్ చేస్తూనే, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా చాలా ఫాస్ట్‌గా చేస్తున్నారు.

ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడీ లాక్ చేసినట్టు ఇప్పటికే పోస్టర్ రిలీజ్ చేశారు. ఇప్పుడు ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశాడు అల్లు అర్జున్. ఈసారి దేశవ్యాప్తంగా ముఖ్యంగా నార్త్‌లో బాగా ప్రమోషన్స్ చేయాలనుకుంటున్నాడు. అయితే ముందుగా సొంత గడ్డపై ఫస్ట్ ఈవెంట్ స్టార్ట్ చేయబోతున్నాడు. అక్టోబర్ 24న ఫస్ట్ క్వచన్ అండ్ ఆన్సార్ ప్రెస్ మీట్ పెడుతున్నాడు. ఇందులో పుష్ప-2 సినిమాకు సంబంధించిన అన్ని విషయాలపై మాట్లాడమే కాదు..సినిమా నుంచి పాలిటిక్స్‌ వరకు అన్నింటికీ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

ఎన్నికల సమయంలో అల్లుఅర్జున్ తన ఫ్రెండ్ వైసీపీ రవిచంద్ర కిశోర్‌రెడ్డి విజయం కోసం ఆయన ఇంటికి వెళ్లారు. తర్వాత నాగబాబు ట్వీట్, సాయిధరమ్‌ తేజ్‌ అన్‌ ఫాలో కొట్టడం..ఇలా వరుసగా ఇష్యూస్ జరిగాయి. తర్వాత సోషల్ మీడియాలో అల్లు వర్సెస్ మెగా అన్నట్లుగా వార్ జరుగుతోంది.

ఈ అన్ని అంశాలపై అల్లుఅర్జున్‌ను జర్నలిస్టులు క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. ఈ ఇష్యూస్‌పై బన్నీ ఎలా రియాక్ట్ అవతున్నాడన్నది మాత్రం ఆసక్తి రేపుతోంది. క్లారిటీ ఇచ్చి కాంట్రవర్సీకి ఫుల్‌ స్టాప్‌ పెడుతారా తగ్గేదేలే అంటూ బయట జరుగుతున్న ప్రచారానికి ఆజ్యం పోస్తారా అన్నది ప్రెస్‌మీట్‌తో తేలిపోతునుంది. మూవీతో పాటు పాలిటిక్స్‌కు ముడిపడి ఉన్న అంశాలపై డిస్కషన్‌ జరుగుతోన్న టైమ్‌లో.. పుష్ప-2 ప్రెస్‌మీట్ ఉత్కంఠ రేపుతోంది.

Gangavva : గంగవ్వపై కేసు నమోదు.. బిగ్ బాస్ లో ఉంటుందా? వచ్చేస్తుందా?