Site icon 10TV Telugu

Sukumar : సీన్ అదుర్స్..! చంద్రబోస్ కాళ్లు మొక్కిన సుకుమార్

Sukumar Touches Chandrabose Feet

Sukumar Touches Chandrabose Feet

Sukumar : సినీ పాటల రచయిత చంద్రబోస్ టాలెంట్ అద్భుతమని ప్రశంసించారు దర్శకుడు సుకుమార్. హైదరాబాద్ లో ‘పుష్ప థ్యాంక్స్ మీట్’ లో మాట్లాడిన సుకుమార్.. రైటర్ చంద్రబోస్ ను ప్రశంసల్లో ముంచెత్తారు. చంద్రబోస్ శక్తి, ప్రతిభ ఏంటో తనకు బాగా తెలుసన్నారు. పుష్ప సినిమా తనకు మళ్లీ లైఫ్ ఇచ్చిందని.. ఇందులో చంద్రబోస్ పాత్ర కూడా ఉందంటూ ఆయనకు సుకుమార్ పాదాభివందనం చేశారు. సుకుమార్ కాళ్లు మొక్కేందుకు ప్రయత్నిస్తుంటే వద్దని వారిస్తూ.. తానే ఆయన కాళ్లు తాకేందుకు చంద్రబోస్ ప్రయత్నించారు. ఒకరిపై మరొకరు చూపించుకున్న ఈ కృతజ్ఞతాభివందన సన్నివేశం చూసిన వారి గుండెలు ఉప్పొంగిపోయాయి.

Read This : Pushpa Thank You Meet : కంటతడి పెట్టిన సుకుమార్..

ఊ అంటావా ఉఊ అంటావా పాటను నాలుగేళ్ల కిందటే తనకు చంద్రబోస్ వినిపించారని సుకుమార్ చెప్పారు. ఐతే.. ఈ పాటను తనకోసం ఎవరికీ వాడకుండా దాచిపెట్టాలని కోరినట్టు గుర్తుచేశారు. అలా దాచిన పాట ఈ రోజు ప్రపంచం మొత్తాన్ని ఊ కొట్టిస్తోందన్నారు. ఆ తర్వాత చంద్రబోస్ ను స్టేజీపైకి పిలిపించుకున్నారు సుకుమార్. చంద్రబోస్ స్పాంటేనిటీ అమోఘమన్నారు. ఆయన శక్తికి పాదాభివందనం అని సభాముఖంగా సుకుమార్.. చంద్రబోస్ కాళ్లపై పడ్డారు.

Read This : Allu Arjun: నువ్వు లేక నేను లేను.. సుకుమార్‌ను తలచుకొని ఏడ్చేసిన బన్నీ!

“చంద్రబోస్ అక్షర జ్ఞానం, జ్ఞాపక శక్తి చాలా గొప్పవి. ఈ సందర్భంగా సీతారామశాస్త్రిని తలుచుకుంటున్నా. నేను ఇండస్ట్రీకి వస్తూ ఇద్దరు వ్యక్తులను చూడాలనుకున్నా. ఒకరు శాస్త్రి అయితే.. మరొకరి పేరు ఇప్పుడు చెప్పలేను. ఆ తర్వాత అంత గొప్ప వ్యక్తి ఎవరో వెతుక్కోవాలనుకున్నాను. నాకు చంద్రబోస్ దొరికారు. పాట కావాలంటే.. ఐదు నిమిషాల్లో చిటికేసినంత ఈజీగా నాకు పాట, పల్లవులు చెబుతుంటారు. అది చూసి ఆశ్చర్యపోతుంటా. నేను, దేవిశ్రీ పాటల కంపోజింగ్ లో చంద్రబోస్ రాసిన సాహిత్యాన్ని బాగా ఎంజాయ్ చేస్తుంటాం. చంద్రబోస్ నవ్వుతూ ఉంటే మామూలు వ్యక్తిగానే ఉంటారు. పాట రాసినప్పుడు ఆయన శక్తి ఏంటో తెలుస్తుంది. ఆయన గురించి అందరికీ తెలియాలి. అందుకే ఇలా పిలిపించాను” అన్నారు సుకుమార్.

 

 

Exit mobile version