Allu Arjun : ‘బన్నీ రికార్స్ మోత’.. పుష్ప 50 రోజుల కలెక్షన్, పుష్ప 2కి కేవలం రెండు రోజుల్లోనే..
అల్లు అర్జున్ పుష్ప సినిమాతో బ్రేక్ చేస్తున్న రికార్డ్స్ మోత మోగిస్తున్నాయి. 2

Pushpa2 crossed the collections of Pushpa1 within 2 days
Allu Arjun : ‘పుష్ప’.. ఎక్కడ విన్నా ఇదే పేరు వినిపిస్తుంది. అల్లు అర్జున్ పుష్ప సినిమాతో బ్రేక్ చేస్తున్న రికార్డ్స్ మోత మోగిస్తున్నాయి. 2017లో పుష్ప వన్ తెరకెక్కింది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా అనసూయ, ఫహాద్ ఫాజిల్, సునీల్ పలు కీలక పాత్రల్లో నటించారు. పుష్ప 1 సినిమా విడుదలైనప్పుడు సంచలన విజయాన్ని అందుకుంది. కాసుల వర్షం కురిపించింది.
ఇక ఇప్పుడు పుష్ప 2, పార్ట్ వన్ కి మించిన విజయంతో దూసుకుపోతుంది. విడుదలైన మొదటి రోజే 294 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఓపెనింగ్స్ తోనే సరికొత్త రెకార్డ్స్ నెలకొల్పిన ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లో 500 కోట్లకి పైగా వసూలు చేసింది. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, ఇతర భాషల్లో కూడా భారీ వసూళ్లను అందుకుంటుంది.
Also Read : Pushpa 2 : హిందీలో అల్లు అర్జున్ రేర్ రికార్డు.. మూడు రోజుల్లో పుష్ప 2 హిందీ కలెక్షన్స్ ఎంతంటే..
అయితే పుష్ప 2 పార్ట్స్ తో తన రికార్డు తనే బ్రేక్ చేసుకున్నాడు అల్లు అర్జున్. పుష్ప 1 విడుదలైన 50 రోజులు వసూలు చేసిన కలెక్షన్ ను పుష్ప 2 కేవలం రెండు రోజుల్లోనే సాధించింది. పుష్ప వన్ 50 రోజుల్లో 365 కోట్లకి పైగా వసూలు చేస్తే.. పుష్ప 2 రెండు రోజుల్లోనే దానికంటే ఎక్కువ 449 కోట్లు వసూలు చేసి పుష్ప1 రికార్డు బ్రేక్ చేసింది. అల్లు అర్జున్ ఈ విషయంలో తన రికార్డు తనే బ్రేక్ చేసుకున్నాడని చెప్పొచ్చు .