పి.వి ‘ఛేంజ్ విత్ కంటిన్యుటీ’ డాక్యుమెంటరీ
భారత మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు జీవితం ఆధారంగా ఛేంజ్ విత్ కంటిన్యుటీ’పేరుతో డ్యాక్యుమెంటరీ రూపొందుతోంది.

భారత మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు జీవితం ఆధారంగా ఛేంజ్ విత్ కంటిన్యుటీ’పేరుతో డ్యాక్యుమెంటరీ రూపొందుతోంది.
భారత మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు జీవితం ఆధారంగా ఛేంజ్ విత్ కంటిన్యుటీ’పేరుతో డ్యాక్యుమెంటరీ రూపొందుతోంది. 1957లో అసెంబ్లీలో అడుగుపెట్టి రాజకీయ జీవితాన్ని ఆరంభించిన పి.వి మంత్రిగా, ముఖ్యమంత్రిగా, దేశ 9వ ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు పివి నరసింహారావు జీవితం ఆధారంగా రూపొందుతున్న డాక్యుమెంటరీలో ఆయనతో కలిసి పనిచేసిన 30 మంది ప్రముఖుల్లో ప్రీడమ్ ఫైటర్లు నుంచి నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన రాజకీయనేతలు, ఆర్థికవేత్తలు, దౌత్యవేత్తలు, జర్నలిస్టులు, రచయితలు, తన కుటుంబ సభ్యులు ఇలా ప్రతిఒక్కరు చెప్పిన సమాచారాన్ని ఇందులో చూపించారు.
రాజకీయంగా ఆయన ఎదుర్కొన్న ప్రతికూల పరిస్థితులను కూడా డాక్యుమెంటరీలో ప్రస్తావించారు. గొప్ప రాజకీయవేత్తగా దేశ ప్రజల కోసం ఆయన 1991లో తీసుకున్న కొన్ని కఠిన నిర్ణయాలు దేశా అభివృద్ధిలో ఎలాంటి పెనుమార్పులను తీసుకొచ్చాయో ఇందులో చూపించారు. శ్రావణీ, శ్రీకర్ దర్శక నిర్మాతలుగా వ్యవహరించిన ఈ పూర్తి డాక్యుమెంటరీని జూన్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పి.వి నరసింహారావుపై జీవితం గురించి తెలుసుకునేందుకు 2 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా విశ్లేషించి చివరికి పివి జీవితాన్ని డాక్యుమెంటరీగా రూపొందించారు.
Read Also : నేను టాయిలెట్స్‌కి చౌకీదార్ – మోడీ