Salaar Affect : PVRపై సలార్ రిలీజ్ ఎఫెక్ట్.. దారుణంగా పడిపోయిన షేర్లు

ప్రభాస్ సలార్.. షారుఖ్ డంకీ ..ఈ రెండు సినిమాలలో షారుఖ్ సినిమా తమ థియేటర్లలో విడుదల చేయడానికి పీవీఆర్ ఐనాక్స్ మొగ్గు చూపాయన్న వార్తలు పీవీఆర్‌పై చాలానే ఎఫెక్ట్ చూపింది.

Salaar, Dunki

Salaar Affect on PVR Shares : ప్రభాస్ ‘సలార్’ మూవీ డిసెంబర్ 22 న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా విడుదలకు ముందు టిక్కెట్ల కోసం ఆడియన్స్ ఓ రేంజ్‌లో ఎదురుచూశారు. ఈ సమయంలోనే సలార్ సినిమాను మల్టీప్లెక్స్‌లలో రిలీజ్ చేయడం లేదంటూ వార్తలు వచ్చాయి. షారుఖ్ ఖాన్ సినిమా ‘డంకీ’ రిలీజ్ చేయడానికి మల్టీప్లెక్స్ థియేటర్లు సుముఖత చూపినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ వార్తల నేపథ్యంలో పీవీఆర్‌లో సలార్ రిలీజైంది. ముందు జరిగిన ఊహాగానాలు పీవీఆర్‌పై చాలానే ఎఫెక్ట్ చూపించాయి.

Also Read: సినీ పరిశ్రమకు మరో శివగామి దొరికేసింది.. అంతా ‘సలార్’ మహిమ.. ఎలాగంటే?

ప్రముఖ మల్టీప్లెక్స్ థియేటర్లు పీవీఆర్, ఐనాక్స్ సలార్ సినిమాకి స్క్రీన్స్ ఇవ్వడం లేదంటూ వార్తలు వచ్చాయి. షారుఖ్ డంకీ సినిమాకే స్క్రీన్స్ కేటాయిస్తూ సలార్‌ని పక్కన పెట్టారని అనుకున్నారు. దీంతో సలార్ నిర్మాతలకు కోపం వచ్చి సౌత్‌లో సలార్ సినిమాని పీవీఆర్, ఐనాక్స్‌లలో రిలీజ్ చేయకూడదని డిసైడయ్యారని కూడా వార్తలు వచ్చాయి. ఇదంతా గాలివార్తలుగా కొట్టిపారేస్తూ సలార్‌కు PVR దేశమంతటా స్క్రీన్స్ ఇచ్చింది. కానీ మీడియాలో సలార్‌కు అన్యాయం జరుగుతోందని పలు కథనాలు బయటకు రావడంతో ఆ వార్తలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు డంకీ సినిమా పట్ల పీవీఆర్, ఐనాక్స్‌లు అభిమానం ప్రదర్శించడం చూసి విస్తుపోయారు. #BoycottPVRInox అనే హ్యాష్ ట్యాగ్‌తో ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. బాహుబలి 2 పీవీఆర్, ఐనాక్స్ చైన్స్‌లో ఎంతటి వసూళ్లను రాబట్టిందో గుర్తు చేశారు.

Also Read: సలార్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. బాలీవుడ్‌కి మళ్ళీ టెన్షన్..

సోషల్ మీడియాలో సలార్ కి అన్యాయం జరిగిందన్న వార్తలు గురువారం పీవీఆర్ ఐనాక్స్ షేర్లపై ప్రభావం చూపించాయి. పీవీఆర్ ఐనాక్స్ షేర్లు 1.26 శాతం తగ్గి రూ.1,736.65 వద్ద ట్రేడయ్యాయి. దీంతో ఐదు సెషన్లలో షేర్ 4 శాతం పతనమైంది. సలార్ సినిమా కోసం పీవీఆర్, ఐనాక్స్, సినీ పోలీస్ మొత్తం చైన్లలో 30 లక్షల పైగా టిక్కెట్లు అమ్ముడు పోయాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ 13.25 లక్షల టిక్కెట్లు అమ్ముడు పోగా, తెలంగాణలో 6 లక్షలు, సౌతిండియాలో 5.25 లక్షలు, కర్నాటకలో 3.25 లక్షలు, కేరళలో 1.5 లక్షలు, తమిళనాడులో లక్ష టిక్కెట్లు అమ్ముడు పోయాయి. సలార్ US ప్రీమియర్లలో ఏ భారతీయ సినిమా వసూలు చేయని విధంగా 70,000 టిక్కెట్లకు గాను వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. 70,000 టిక్కెట్లకు గానూ $1.81 మిలియన్లకు పైగా అత్యధిక వసూళ్లు రాబట్టింది సలార్.