×
Ad

R Movie: ఘనంగా మొదలైన ‘R’ సినిమా షూటింగ్.. అక్టోబర్ లో విడుదల

R మూవీ(R Movie) రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యింది.

R movie regular shooting started officially

R Movie: సంతోష్ కృష్ణన్, భాగ్య రెడ్డి, బ్రహ్మానందం రెడ్డి, దుర్గమ నాయుడు, పవన్, సిరి, సంధ్య, భాను చందర్, స్వాతి తదితరులు ప్రధాన పాత్రల్లో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘R(R Movie)’. GMAA ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో శిరీష గారి సమర్పణలో వస్తున్న ఈ సినిమాకు గోలి రామకృష్ణ దర్శకత్వం, నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ సినిమా నేడు(మార్చి 9) శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో పూజ కార్యక్రమాలతో ఘనంగా మొదలయ్యింది.

Kamal Haasan: 20 రోజులకే రూ.150 కోట్లు.. ఇండియాలోనే హైయ్యెస్ట్ రెమ్యునరేషన్.. కమల్ సరికొత్త రికార్డ్

మార్చి 20వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్న ఈ సినిమా అక్టోబర్ 17వ తేదీన విడుదల కానుంది. ఈమేరకు చిత్ర నిర్మాతలు ప్రకటన చేశారు. ఈ సందర్బంగా గోలి రామకృష్ణ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాను రెండు షెడ్యూల్స్ లోనే పూర్తి చేయనున్నాము. నటీనటుల సహకారంతో చిత్ర షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో పూర్తి చేస్తాము. మంచి సందేశాత్మకమైన కంటెంట్ తో వస్తున్న ఈ సినిమాకి సంబంధించిన ఇతర విషయాలు త్వరలోనే ఒక విభిన్నమైన శైలిలో తెలియజేస్తాము” అని తెలిపారు.