Band Melam OTT: ఓటీటీలో కొత్త సినిమా.. ‘బ్యాండ్ మేళం’ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన బ్యాండ్ మేళం మూవీ ఓటీటీ(Band Melam OTT) స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది.
Harsh Roshan, Sridevi band melam movie ott streaming update
Band Melam OTT: ‘కోర్ట్’ వంటి వినూత్న చిత్రంతో మెప్పించిన హిట్ పెయిర్ హర్ష్ రోషన్, శ్రీదేవి ప్రధాన పాత్రలలో నటించిన తాజా చిత్రం ‘బ్యాండ్ మేళం(Band Melam OTT)’. సతీష్ జివ్వాజీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. మార్చి నెలలో థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను అలరించిన ఈ వినోదాత్మక చిత్రం, ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో సందడి చేయడానికి సిద్ధమైంది.
Suyodhana OTT: సైలెంట్ గా ఓటీటీకి వచ్చేసిన ‘సుయోధన’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ప్రముఖ ఓటీటీ సంస్థ ‘జీ 5’ (Zee 5) ఈ సినిమా స్ట్రీమింగ్ వివరాలను అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 24 నుంచి ‘బ్యాండ్ మేళం’ ఈ ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులోకి రానుంది. “మీరు మెచ్చిన జంట మరోసారి దరువేయబోతోంది.. మీరు సిద్ధమా?” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ప్రేక్షకుల ఆసక్తిని పెంచేసింది. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన వారు, ఇప్పుడు ఓటీటీ వేదికగా ఈ ఫన్ రైడ్‌ను ఎంజాయ్ చేయవచ్చు.
